Begin typing your search above and press return to search.
250 కార్లు 120 మంది బందోబస్త్ బాప్ రే మెగా టూర్!
By: Tupaki Desk | 6 Oct 2019 5:16 AM GMTమెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా నేడు ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలో విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన వివరాలు తాజాగా రివీలయ్యాయి.
తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ లో 9 అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఇప్పటికే అభిమాన సంఘాలు సిద్ధం చేశాయి. ఈ విగ్రహావిష్కరణ కోసం చిరు ఉదయం 9.00 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. విమానాశ్రయంలో చిరంజీవికి పలు పార్టీలకు సంబంధించిన కీలక నేతలు.. అభిమానులు ఘన స్వాగతం పలుకనున్నారు. ఇప్పటికే చిరు ఆన్ ది వే అని తెలుస్తోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి సుమారు 250 కార్లకు పైగా భారీ ర్యాలీతో రోడ్డు మార్గంలో చిరు తాడేపల్లి గూడెం చేరుకుంటారు. మార్గమధ్యంలో అక్కడక్కడా అవసరం మేరకు రోడ్ షో నిర్వహిస్తారని తెలుస్తోంది.
10.30 నుంచి 11.00 గంటల మధ్యలో తాడేపల్లిగూడెం చేరుకుంటారు. అటుపై ఎస్వీ రంగారావు విగ్రహాం ఆవిష్కరించి ఆ పక్కనే ఏర్పటు చేసిన సభావేదికపై ప్రసంగిస్తారు. సుమారు 45 నిముషాలకు పైగా చిరు ప్రసంగం సాగనుంది. 12.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 లోగా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ విజిట్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 120 మంది పోలీసు సిబ్బందితో చిరుకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆ మేరకు పోలీసు బలగాలు సిద్ధంగా ఉన్నాయట. ఈ కార్యక్రమంలో పాల్గొనే నేతలు.. ఇతర ప్రముఖులు ఎవరు అన్నది తెలియాల్సి ఉందింకా.