Begin typing your search above and press return to search.

`పుష్ప` రెండు భాగాల‌కు 250 కోట్లు.. పార్ట్ 2 టైటిల్ ఎంపిక షురూ!

By:  Tupaki Desk   |   18 May 2021 11:30 AM GMT
`పుష్ప` రెండు భాగాల‌కు 250 కోట్లు.. పార్ట్ 2 టైటిల్ ఎంపిక షురూ!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్ మూవీ `పుష్ప` చిత్రీక‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. మ‌హ‌మ్మారీ సెకండ్ వేవ్ ప్ర‌భావ‌మిది. ఇంకా నెల‌రోజుల చిత్రీక‌ర‌ణ పెండింగులో ఉంది. మొద‌టి భాగం చిత్రీక‌ర‌ణ పూర్తి కాగానే సీక్వెల్ చిత్రీక‌ర‌ణ కూడా ప్రారంభ‌మ‌వుతుంది.

సీక్వెల్ కి పుష్ప కాకుండా వేరే టైటిల్ ని ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. మొదటి భాగానికి `పుష్ప` అని పేరు పెట్టారు. అది హీరో పుష్ప‌రాజ్ నేమ్. ఇంతకుముందు ప్రకటించినట్లు రెండవ భాగం టైటిల్ అతి త్వరలో ఖరార‌వుతుంది. దీనిపై ఒక అధికారిక ప్ర‌క‌ట‌న ఉంటుంది.

షూటింగ్ పునఃప్రారంభమైన తర్వాత మొదటి భాగం షూటింగ్ ఒక నెలలోపు పూర్త‌వుతుంది. పుష్ప‌-1 ఈ ఏడాది చివరి నాటికి రిలీజ‌వుతుంది. సీక్వెల్ వియానికొస్తే.. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది భారీ స్థాయిలో ఉంటుంది. పుష్ప డ్యూయాలజీ కోసం మైత్రి మూవీ మేకర్స్ 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ను కేటాయించింది. రాజీ లేకుండా పెట్టుబ‌డుల్ని స‌మ‌కూరుస్తోంది.