Begin typing your search above and press return to search.

వామ్మో.. 3 నెలల్లో 3 సినిమాలు - 3 డిఫరెంట్ లుక్స్..!

By:  Tupaki Desk   |   5 March 2021 7:36 AM GMT
వామ్మో.. 3 నెలల్లో 3 సినిమాలు - 3 డిఫరెంట్ లుక్స్..!
X
'రాధే శ్యామ్‌' షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌.. మరో రెండు సినిమాల చిత్రీకరణ మొదలుపెట్టేసాడు. ఓవైపు సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో 'సలార్'.. మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో 'ఆదిపురుష్‌' షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఇలా ప్రభాస్ 3 నెలల గ్యాప్ లో మూడు వేరు వేరు ప్రాంతాల్లో 3 డిఫరెంట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు. అదే సమయంలో ఈ సినిమాల కోసం 3 డిఫరెంట్ లుక్స్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు డార్లింగ్. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్‌ న్యూ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

'జాతిరత్నాలు' ట్రైలర్ లాంచ్ సందర్భంగా బయటకు వచ్చిన ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. గుబురు మీసాలతో ప్రభాస్ పవర్ ఫుల్ గా ఉన్నాడు. ఈ లుక్ 'సలార్' లోని మరో క్యారక్టర్ కోసమని గెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ గుబురు మీసంతో పాటు ఫుల్ గడ్డంతో మోస్ట్ వైలెంట్ గా ఉన్నాడు. దీనిని బట్టి చూస్తే ఈ సినిమాలో ప్రభాస్ రెండు షేడ్స్ లో కనిపించడం ఖాయమని అర్థం అవుతోంది. అలానే ఇటీవల ముంబయిలో ఓ అభిమానితో దిగిన ఫోటోలో కళ్లజోడు తలకు క్యాప్‌ పెట్టుకుని పొడుగు మీసాలతో క్లీన్ షేవ్ లో కనిపించాడు ప్రభాస్. ఇది 'ఆదిపురుష్‌' కోసం ప్రభాస్ లుక్‌ అనిపిస్తోంది. ఇక 'రాధే శ్యామ్' లో ట్రిమ్డ్ గడ్డం మీసాలతో ప్రభాస్ కనిపించనున్నాడు. మొత్తం మీద పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఆ ఇమేజ్ ని నిలబెట్టుకునే క్రమంలో బాగా కష్టపడుతున్నాడని అర్థం అవుతోంది.