Begin typing your search above and press return to search.
కేవలం 4 వారాల్లో ఏకంగా 3 సినిమాలు.. స్టార్ హీరోయిన్ ట్రీట్!
By: Tupaki Desk | 3 March 2021 9:47 AM GMTబాలీవుడ్ యాక్ట్రెస్ పరిణీతి చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ప్రియాంకచోప్రా కజిన్ గా సినిమాల్లోకి అడుగుపెట్టిన పరిణీతి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. పదేళ్ల క్రితం కెరీర్ ప్రారంభించిన అమ్మడు.. అంటే 2011లో 'లేడీస్ వర్సెస్ రికీ బౌల్' సినిమాతో హీరోయిన్ అయింది. ఫస్ట్ సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. 2012లో ఇషాక్ జాదే.. 2013లో శుద్ధ్ దేశి రొమాన్స్.. 2014లో హసీ తో ఫసీ.. ఇలా వరుస విజయాలతో ఇండస్ట్రీని ఆకర్షించింది. ఇషాక్ జాదే, శుద్ధ్ దేశి రొమాన్స్ మూవీలలో పరిణితి రొమాన్స్ యువతకు కిక్కిచ్చిందని చెప్పాలి. అయితే మొదట్లో స్పీడ్ కనిపించింది కానీ ఇప్పుడు పరిణితి పూర్తిగా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం అమ్మడి సినిమాల విషయాలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ భామ నుండి కేవలం 4 వారాలలో 3 సినిమాలతో అలరించేందుకు రెడీ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది మిస్ చోప్రా. ఫిబ్రవరి 26న నెట్ ఫ్లిక్స్ మూవీ `ద గాళ్ ఆన్ ద ట్రైన్`తో ఆకట్టుకున్న పరిణీతి.. మార్చ్ 19న `సందీప్ ఔర్ పింకీ ఫరార్`తో థియేటర్లోకి రానుంది. ఇష్క్ జాదే, నమస్తే ఇంగ్లాండ్ సినిమాల తర్వాత అర్జున్ కపూర్ తో పరిణీతి మూడోసారి జోడికట్టింది. ఆ వెంటనే మార్చి 26న బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన `సైనా` బయోపిక్ తో సిద్ధమైంది పరిణీతి చోప్రా. సైనా పాత్రకోసం ప్రత్యేకంగా బ్యాట్మింటన్ శిక్షణ తీసుకుని నటించింది సుందరి. మొత్తానికి కేవలం నెలరోజుల వ్యవధిలో మూడు సినిమాలు రావడం విశేషమే. మరో చూడాలి.. `ద గాళ్ ఆన్ ద ట్రైన్` మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి మిగతావాటి పరిస్థితి ఎలా ఉందో!