Begin typing your search above and press return to search.
ఐదేళ్లలో 3 వేల కోట్లు..కేజీఎఫ్ మేకర్స్ భారీ స్కెచ్
By: Tupaki Desk | 23 Dec 2022 11:34 AM GMTకేజీఎఫ్, కాంతార సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన నిర్మాత సంస్థ హోబలే ఫిలింస్. దేశ వ్యాప్తంగా ఈ సినిమాతో భారీ వసూళ్లని రాబట్టడమే కాకుండా టాక్ ఆఫ్ ది ఇండియాగా నిలిచిన హోబలే ఫిలింస్ రానున్న ఐదేళ్లలో ఇండియన్ సినిమాలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనుందట. దక్షిణాదిలో ఇతర భాషలపై దృష్టి పెట్టిన ఈ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ రాబోయే ఐదేళ్లలో ఇండియన్ సినీ పరిశ్రమలో రూ. 3 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టుగా వెల్లడించారు.
ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన ఆయన 'కేజీఎఫ్ 3' పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు వినోద పరిశ్రమ మరింతగా అభివృద్ది చెందబోతోంది. ఏటా కనీసం ఐదారు సినిమాలు బా బ్యానర్ మీద నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో ఓ హిట్ సినిమాకు సీక్వెల్ కూడా వుండబోతోంది. దక్షిణాది భాషలన్నింటీలో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం అని తెలిపారు. అంతే కాకుండా మన సంస్కృతి సంప్రదాయాతో ముడిపడి వున్న కథలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నాం అన్నారు.
మన తరువాత తరాలకు వాటిని అందించాలన్నదే మా లక్ష్యం అని, హిందీలోనూ సినిమాలు నిర్మిచబోతున్నామని, ఇందు కోసం ఇద్దరు హిందీ రచయితలతో కథలు రాయిస్తున్నామని, స్టోరీ రెడీ అయ్యాక డైరెక్టర్, నటీనటుల అన్వేషణ మొదలుపెడతామని తెలిపారు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి వెల్లడిస్తూ ' ప్రభాస్ తో చేస్తున్న 'సలార్' చిత్రీకరణ జరుగుతోందని, ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేస్తామన్నారు. దూమమ్ అనే మల్టీలాంగ్వేజ్ మూవీని, శ్రీమురళితో 'భగీర' అనే కన్నడ సినిమాను, కీర్తి సురేష్ తో 'రఘుతాత' అనే తమిళ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు.
రానున్న రెండేళ్లలో 12 నుంచి 14 చిత్రాలు నిర్మించనున్నాం. 2024లో పృథ్వీరాజ్ సుకుమారన్ 'టైసన్', రక్షిత్ శెట్టి 'రిచర్డ్ ఆంటోనీ', సుధా కొంగర సినిమాలు రానున్నాయన్నారు. కేజీఎఫ్ 1, 2 సిరీస్ లు సంచలన విజయాలు సాధించడంతో 'కేజీఎఫ్ 3' ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ 'సలార్' పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 3'పై దృష్టి పెట్టనున్నాడు. తన వద్ద ఇప్పటికే స్టోరీ లైన్ వుంది. వచ్చే ఏడాది కానీ లేదు ఆ తరువాత ఏడాది కానీ 'కేజీఎఫ్ 3' అబిమానుల కల నెరవేరే అవకాశం వుందన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.