Begin typing your search above and press return to search.

పైరసీకి కేంద్రం కొత్త బిల్లు

By:  Tupaki Desk   |   8 Feb 2019 6:48 AM GMT
పైరసీకి కేంద్రం కొత్త బిల్లు
X
అన్ని భాషల సినీ పరిశ్రమలను పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య పైరసీ. కోట్లు పెట్టి నిర్మించిన సినిమా విడుదలైన రోజే పైరసీ అవుతుంటే నిర్మాతలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎంతగా ప్రయత్నించినా కూడా పైరసీని అడ్డుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం అవుతోంది. పెరిగిన టెక్నాలజీ కారణంగా పైరసీ దారుణంగా పెరిగి పోయింది. పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లును తీసుకు వచ్చింది. సినిమాటోగ్రఫీ 1952 సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

కొత్త బిల్లు ప్రకారం ఎవరైనా పైరసీకి పాల్పడ్డట్లుగా నిరూపితం అయితే మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు పది లక్షల వరకు జరిమానా విధించబడుతుంది. ఈ కొత్త కొత్త బిల్లుపై బాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఇంకా సినీ వర్గాలకు చెందిన వారు ఎంతో మంది హర్షం వ్యక్తం చేశారు. అయితే కింది స్థాయి వారు మాత్రం ఈ బిల్లుతో పైరసీ తగ్గుతుందనే నమ్మకం లేదు అంటున్నారు. పైరసీ చేసే వారు వాడుతున్న టెక్నాలజీ కారణంగా వారిని పట్టుకోవడం కష్టం అవుతుందని పోలీసులు కూడా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వారిని పట్టుకుని జైలు శిక్ష ఎలా విధిస్తారనేది సామాన్యుల ప్రశ్న.