Begin typing your search above and press return to search.

30శాతం షోల ర‌ద్దుతో పంపిణీదారులు గ‌గ్గోలు!

By:  Tupaki Desk   |   17 Aug 2022 4:30 AM GMT
30శాతం షోల ర‌ద్దుతో పంపిణీదారులు గ‌గ్గోలు!
X
బాలీవుడ్ కి మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. లాల్ సింగ్ చద్దా - రక్షా బంధన్ 30 శాతం షోలు రద్దు కావడంతో ఎగ్జిబిటర్లు గ‌గ్గోలు పెట్టారని బాలీవుడ్ మీడియా వెల్ల‌డించింది. లాల్ సింగ్ చద్దా - రక్షా బంధన్ డిజాస్ట‌ర్ ఫ‌లితాల‌తో షాక్ లో ఉన్న హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి మంగళవారం ఉదయమే పెద్ద షాక్ తగిలింది. ప్రేక్షకులు లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఎగ్జిబిటర్లు లాల్ సింగ్ చద్దా - రక్షా బంధన్ మార్నింగ్ షోలను రద్దు చేయవలసి వచ్చింది.

ఎగ్జిబిటర్లు వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. మంగళవారం ఉదయం మధ్యాహ్నం మొత్తం షోలలో 30 శాతం ప్రేక్షకులు లేకపోవడంతో రద్దు చేయవలసి వచ్చిందని తెలిసింది. షోలు వేసినా కానీ 15 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీని నమోదు చేశాయి. ఇది బ్లాక్ వీక్ అని కూడా ఎగ్జిబిట‌ర్లు వ్యాఖ్యానించ‌డం ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది.

ఓ ఎగ్జిబిట‌ర్ మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ - అక్షయ్ కుమార్ ఇద్దరూ తమ చిత్రాల ఎంపికపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారి అభిమానులు రక్షా బంధన్ - లాల్ సింగ్ చద్దాను నిర్ధ‌య‌గా తిరస్కరించారు.. అని అన్నారు. పార్సీ న్యూ ఇయర్ కారణంగా దేశంలో పాక్షిక సెలవు ఉన్నప్పటికీ రెండు చిత్రాలకు బిగ్ డ్రాప్ ఎదురైంది.

శుక్రవారం లాల్ సింగ్ చద్దాకు ప్రేక్షకులు రాకపోవడంతో సుమారు 1300 షోలు .. రక్షా బంధన్ కు 1000 షోలు రద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. మంగళవారం కూడా రెండు చిత్రాలకు అదే ట్రెండ్ పునరావృతమైంది. కానీ చాలా పెద్ద స్థాయిలో మూల్యం చెల్లించుకున్నాయి.

అమీర్ ఖాన్ - అక్ష‌య్ కుమార్ లాంటి అగ్ర హీరోల సినిమాలు ఇలా ఫ్లాపుల‌వుతుంటే మ‌రోవైపు టాలీవుడ్ యువ‌హీరో నిఖిల్ సిద్ధార్థ్ న‌టించిన కార్తికేయ 2 కి ఉత్త‌రాదిన షోలు పెంచ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. నిఖిల్ కెరీర్ లోనే ఊహించ‌ని రీతిలో ఉత్త‌రాదిన 700 థియేట‌ర్ల‌లో కార్తికేయ 2 ఆడుతోందని స‌మాచారం.

నిజానికి బాలీవుడ్ పెద్ద హీరోల సినిమాలను తొల‌గించ‌లేక ఆడిస్తున్నారు. కానీ నిఖిల్ సినిమా న‌చ్చి జ‌నం థియేట‌ర్ల వైపు వ‌స్తున్నారు. ఇది యువ‌హీరో కెరీర్ కి నిజంగా బిగ్ గేమ్ ఛేంజ‌ర్ గా మారుతుంద‌ని భావిస్తున్నారు. అడివి శేష్ త‌ర్వాత నిఖిల్ పాన్ ఇండియా క్రేజ్ ను ద‌క్కించుకోవ‌డం ఆస‌క్తిక‌రం.