Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' ఒక్క పాట కోసం 30 వర్షన్ లు రెడీ చేశారట
By: Tupaki Desk | 9 Nov 2021 4:31 PM GMTప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన భారీ బడ్జెట్ మూవీ రాధే శ్యామ్. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండి అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ను యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా లో ప్రభాస్ మోడ్రన్ జ్యోతిష్యుడిగా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. తెలుగు భాష మరియు హిందీ భాషల్లో వేరు వేరుగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తెలుగు వర్షన్ లో కృష్ణం రాజు కనిపించబోతుండగా.. హిందీ వర్షన్ లో మాత్రం మరో స్టార్ నటుడు కనిపించబోతున్నాడు. అలాగే మ్యూజిక్ విషయంలో కూడా సౌత్ కు ఒక వర్షన్.. హిందీ ప్రేక్షకుల కోసం ఒక వర్షన్ ను రెడీ చేశారట. సౌత్ లో సినిమా నిడివి.. బాలీవుడ్ లో విడుదల అవ్వబోతున్న సినిమా నిడివి కూడా వేరు వేరుగా ఉంటుందని అంటున్నారు.
బాలీవుడ్ లో ఈ సినిమాకు గాను మనన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించాడు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ సమయంలో పాటలను విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారు. తాజాగా సంగీత దర్శకుడు మనన్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మనన్ భరద్వాజ్ రాధే శ్యామ్ పాటల గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలోని ఒక పాట కోసం 30 వర్షన్ లు రెడీ చేశాను. చివరకు కథ మరియు సన్నివేశంకు తగ్గట్లుగా ఒకటి ఫైనల్ చేశాం. ప్రతి పాట కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది. సినిమాలో పాటలు చాలా బాగుంటాయని.. వినడానికి కూడా ఖచ్చితంగా అందరు మెచ్చే విధంగా ఉంటాయని అతడు చెబుతున్నాడు.
ప్రభాస్ చాలా కాలం తర్వాత లవ్ స్టోరీ లో నటించాడు. కనుక ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రాధాకృష్ణ తెరకెక్కించాడని అంటున్నారు. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. దాదాపుగా మూడు ఏళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాదిలో రావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల ఆలస్యం అయ్యి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు సిద్దం అవుతోంది. ప్రభాస్ మరియు పూజా హెగ్డేల కాంబో లవ్ కమ్ రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్ లు వీడియోలు సినిమా పాన్ ఇండియా రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఉందనే టాక్ ను దక్కించుకుంది.