Begin typing your search above and press return to search.

ఓలమ్మో ఓలమ్మో.. 32 ఏళ్ళ వయసు తేడానా!

By:  Tupaki Desk   |   24 Oct 2019 12:19 PM GMT
ఓలమ్మో ఓలమ్మో.. 32 ఏళ్ళ వయసు తేడానా!
X
సౌత్ లో సీనియర్ స్టార్లు తమకంటే సగం వయసు ఉండే హీరోయిన్లతో జోడీ కట్టినందుకు తీవ్ర విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. కానీ అందరూ ఫాస్ట్.. మోడరన్ అనుకునే బాలీవుడ్ లో కూడా సేమ్ ట్రెండ్ ఉంది. భాయిజాన్ సల్మాన్ ఖాన్ విషయమే తీసుకుంటే ఆయన వయసులో సగం ఉండే భామలతో రొమాన్సు చేయడం ఆయనకు మొదటి నుంచి అలవాటే.

అప్పట్లో 'లక్కీ' సినిమా కోసం 17 ఏళ్ళ వయసున్న స్నేహ ఉల్లాల్ తో జోడీ కట్టాడు. 'దబాంగ్' సినిమా కోసం సోనాక్షి సిన్హాతో జోడీ కట్టాడు. అప్పట్లో సోనాక్షి వయసు 24 ఏళ్ళు. ఇక 'సుల్తాన్' లో జోడీ కట్టిన అనుష్క శర్మ కు సల్మాన్ కు అప్పట్లో దాదాపు 20 ఏళ్ళకు పైగా గ్యాప్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉదాహరణలు ఉన్నాయి. సీన్ కట్ చేసి ప్రెజెంట్ కు వస్తే సల్మాన్ కొత్త సినిమా 'దబాంగ్ 3' విడుదలకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా ఒక హీరోయిన్ గా నటించింది. కుర్రవయసు సల్మాన్ కు జోడీగా మరో హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటించింది.

ఈ అమ్మాయికి ఇదే డెబ్యూ ఫిలిం. ఇంతకీ సాయి మంజ్రేకర్ ఎవరంటే నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ కూతురు. ఈ అమ్మాయి వయసు ఇప్పుడు 21. సల్మాన్ ఖాన్ ప్రస్తుత వయసు 53. అంటే ఇద్దరికీ వయసు తేడా 32 ఏళ్ళు. అసలే సోషల్ మీడియాలో నెటిజన్లు ఊరుకోరు కాబట్టి ఈ ఏజ్ డిఫరెన్స్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. రీసెంట్ గా సల్మాన్ - సాయి మంజ్రేకర్ ల పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. దీంతో ఈ విమర్శలు ఎక్కువయ్యాయి.

అయినా అలాంటివన్నీ పట్టించుకుంటే ఆయన సల్లూ భాయ్ ఎందుకు అవుతాడు? మిగతా హీరోలకు వర్తించే రూల్స్ ఆయనకు వర్తించవు. 53 వయసులో 21 ఏళ్ళ అమ్మయితోనే రొమాన్సు చేయడం కాదు.. 73 ఏళ్ళ వయసులో కూడా ఆయన 23 ఏళ్ళ హీరోయిన్ తో రోమాన్స్ చేయగల సమర్థుడు. పైగా ఎవర్ గ్రీన్ సీనియర్ మోస్ట్ బ్యాచిలర్ ఇన్ ది వరల్డ్ కాబట్టి ఈ విషయంలో విమర్శకులు వాదన అరణ్యరోదనే!