Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హౌస్ లో ఇరిటేట్ చేస్తున్న దుష్ట చతుష్టయం

By:  Tupaki Desk   |   24 Nov 2021 4:36 AM GMT
బిగ్ బాస్ హౌస్ లో ఇరిటేట్ చేస్తున్న దుష్ట చతుష్టయం
X
ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన బిగ్ బాస్ ను సింఫుల్ గా చెప్పేయాలంటే.. వందకు పైగా రోజులు ఒక ఇంట్లో ఉండే కొందరు (దగ్గర దగ్గర 20 మంది వరకు) ఆటలు ఆడుతూ.. తమ తీరుతో ఇంటి సభ్యుల మనసుల్ని గెలుచుకోవటంతోపాటు.. తామేమిటన్న విషయాన్ని మాటలతో.. చేతలతో చూపిస్తూ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవటం ద్వారా టైటిల్ సొంతం చేసుకోవటం ఈ షో. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 చివరకు వచ్చేసింది. 12 వారానికి వచ్చేసరికి ఇంట్లో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. దీంతో ఆట మరింత రక్తి కడుతోంది.

రోజు వారీగా బిగ్ బాస్ పెడుతున్న టాస్కులతో పాటు.. ఆట చివరికి వచ్చేసరికి.. ఎవరికి వారు టైటిల్ ను సొంతం చేసుకోవటం కోసం పడుతున్న ఆత్రుత అంతా ఇంతా కాదు.

ఇందుకోసం ‘తొండి’ ఆట ఆడటానికైనా వెనుకాడని పరిస్థితి. బిగ్ బాస్ 5లో ఇప్పటివరకు ఉన్న కాంబినేషన్లు ఎలా ఉన్నా.. తాజాగా మాత్రం నలుగురు (సన్నీ.. కాజల్.. మానస్.. ప్రియాంక సింగ్) కూడిన జట్టు ఉండేకొద్దీ దుష్ట చతుష్టయాన్ని తలపించేలా మారుతోంది.

ఎవరికి వారుగా ఆడాల్సిన వ్యక్తిగత గేమ్ ను ఇప్పుడు గ్రూప్ గేమ్ గా మార్చేయటం తెలిసిందే. ఇంతకు ముందు షణ్నూ.. సిరి.. జెస్సీలు ఒక జట్టుగా ఉన్నప్పటికీ.. వారిది క్యూట్ ఫ్రెండ్ షిప్ గా ఉండేది. అనారోగ్యం కారణంగా జెస్సీ వెళ్లిపోవటంతో వారిలో ఇద్దరే ఇంట్లో మిగిలారు.

ఇంట్లో ఉన్న వారిలో మాస్ కంటెంట్ తో పాటు.. దురుసు.. దూకుడు క్యారెక్టర్ తో టైటిల్ ను సొంతం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యం తప్పించి.. మంచి.. చెడు లాంటివి అస్సలు పట్టించుకోని తీరును సన్నీ.. కాజల్ లు ప్రదర్శిస్తున్నారు.

వారికి కూసింత అప్ గ్రేడ్ వెర్షన్ గా ప్రియాంక సింగ్ వ్యవహరిస్తున్నారు. వీరి మైండ్ సెట్ కు దగ్గరగా ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో మాత్రం పద్దతి తప్పని పోటీదారుగా మానస్ ఉంటున్నారు.

కాకుంటే.. గేమ్ చివరకు వచ్చే వేళ.. ఇంట్లో ఉన్న ఎనిమిది మందిలో తమదే బలమని.. తాము నలుగురం ఉన్నాం కాబట్టి.. ఎవరినైనా ఇట్టే టార్గెట్ చేయొచ్చన్న మాటల్ని చెప్పేస్తున్న సన్నీ తీరు సిత్రంగా మారింది. ఇంట్లో తరచూ గొడవలు పెట్టటంలో ముందుండే ఆర్జే కాజల్ పెంకితనం భరించ లేని స్థాయికి చేరుతోంది.

గెలుపే లక్ష్యమన్నట్లుగా మారిన ఈ నలుగురు.. మిగిలిన నలుగురిని (షణ్ను.. సిరి.. రవి.. శ్రీరామచంద్ర)టార్గెట్ చేస్తున్న వైనం చూసే వారికి చిరాకు తెప్పించేలా మారింది. దుష్ట చతుష్టంలా మారిన నలుగురిలో సన్నీ.. కాజల్ తీరు రోజురోజుకు ముదురుతోంది. వీరి మాటలు.. చేతలు.. ఇరిటేటింగ్ గా మారటమేకాదు.. వారు వేస్తున్న కుయుక్తులు ఓపెన్ గా అందరికి కనిపిస్తున్నాయి.

అయినప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణ వీరికి ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు.. వారి వైరి వర్గాన్ని ట్రోలింగ్ చేస్తున్న వైనం చూస్తే ఆశ్చర్యానికి గురి చేయక మానదు. కళ్ల ముందు కనిపిస్తున్న సత్యాన్ని కాదని.. మాస్ పోటీదారు అంటూ సన్నీకి అపాదిస్తున్న హీరోయిజాన్ని చూస్తుంటే.. అడ్డదిడ్డంగా ఆడటం.. పిడి వాదన.. హద్దులు దాటే ఆవేశాన్ని ప్రదర్శించటమే మాస్ కంటెస్టెంట్ ఇమేజ్ వస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది.

బిగ్ బాస్ ఇంట్లో గ్రూపు కట్టటం తప్పని చెప్పలేం. అయితే.. నలుగురు కంటెస్టెంట్లు కూడబలుక్కొని చేస్తున్న రాజకీయాన్ని నిత్యం చూస్తున్న వారు సైతం.. తప్పును తప్పుగా.. ఒప్పును ఒప్పుగా కాకుండా.. తాము అభిమానించే వారు ఏం చేసినా సరే.. వెనకేసుకురావాలనే తపన చూస్తే మాత్రం ఆశ్చర్యానికి గురి చేయక మానదు.

ఏమైనా.. ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో దుష్ట చతుష్టంగా మారిన ఆ నలుగురి తీరు అభ్యంతరకంగా మారిందన్న మాట వినిపిస్తోంది.

అందరికి లేబులింగ్ చేసే సన్నీ.. అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తూ.. తాను టార్గెట్ చేసిన వారిపై విరుచుకుపడే తీరు చూస్తే.. ఇలాంటి వారు టైటిల్ విన్నర్ అయితే మాత్రం తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది.

గతంలో జరిగిన సీజన్ లో తన సోషల్ మీడియా టీం చేత బిగ్ బాస్ ను సైతం ప్రభావితం చేసి.. టైటిల్ ను సొంతం చేసుకున్న కౌశిక్ కు తగ్గట్లే.. సన్నీ ఈసారి విన్నర్ గా నిలుస్తారా? లేదంటే.. గేమ్ ను గేమ్ లా ఆడే వారు విజేతగా నిలుస్తారా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.