Begin typing your search above and press return to search.
2.0 రిలీజ్ ముందే 4కోట్ల పంచ్
By: Tupaki Desk | 17 Nov 2018 4:23 AM GMTరజనీకాంత్-అక్షయ్- శంకర్ కాంబినేషన్ మూవీ `2.0` ఈనెల 29న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ దాదాపు 600కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ్ - హిందీ - తెలుగు సహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ రేంజులో రిలీజవుతోంది. అయితే 2.ఓ రిలీజ్ కు ముందే తెలుగు వెర్షన్ రూపంలో 4 కోట్ల మేర నిర్మాత శుభాస్కరన్ కు పంచ్ పడిందన్నది తాజా సమాచారం. ఇంకా రిలీజ్ కాకముందే 4 కోట్లు నష్టమెలా? అంటే దాని వెనక ఉత్కంఠ రేపే గ్యాంగ్ వార్ ఉందన్నది ఇన్ సైడ్ టాక్.
2.ఓ రిలీజ్ హక్కుల విషయమై రెండు గ్యాంగ్ ల మధ్య వార్ నడవడంపై ఇటీవల పెద్ద స్థాయిలో చర్చ సాగుతోంది. దగ్గుబాటి సురేష్ బాబు - ఏషియన్ ఫిలింస్ సునీల్ నారంగ్ గ్యాంగ్ .. ఎన్.వి.ప్రసాద్- దిల్ రాజు-యువి క్రియేషన్స్ వంశీ గ్యాంగ్ మధ్య 2.ఓ హక్కుల కోసం ఆసక్తికర పోరు సాగింది. ఈ గ్యాంగ్ వార్ లో బోలెడన్ని ట్విస్టులు... టర్నులు. ఈ సినిమా రైట్స్ విషయంలో ఓసారి అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయమన్న సురేష్-నారంగ్ బృందం.. ఆ అడ్వాన్సులపై వడ్డీని చెల్లించాల్సిందిగా పట్టుబట్టారట. ఇంకా తమవద్దనే 2.ఓ హక్కులు ఉన్నాయన్న వాదనా వినిపించడం ఇటీవల చర్చకొచ్చింది.
`బాహుబలి` సిరీస్ తరువాత దక్షిణాది చిత్రాలకు భారీగా డిమాండ్ పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకోవాలన్న ఆశతో `2.ఓ` చిత్ర తెలుగు డబ్బింగ్ హక్కుల్ని 82 కోట్లకు డి.సురేష్ బాబు - సునీల్ నారంగ్ చిత్ర బృందంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందు కోసం కొంత అడ్వాన్స్ గా ఇచ్చారు. రకరకాల కారణాలతో 2.ఓ రిలీజ్ పదే పదే వాయిదా పడిన సంగతి తెలిసిందే. కారణం ఏదైనా అడ్వాన్సుల విషయంలో పెద్ద పేచీ లైకా సంస్థకు సురేష్-నారంగ్ బృందానికి మధ్య నడిచింది. ఆ తరువాత ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ - దిల్ రాజు- యువి వంశీ టేకోవర్ చేశారు. ఇందుకు షరతులతో కూడిన ఒప్పందాన్ని వీళ్లు కుదుర్చుకున్నారు. ఆ క్రమంలోనే అడ్వాన్సులపై వడ్డీ ఇవ్వాల్సిందేనంటూ డి.సురేష్ బాబు - సునీల్ నారంగ్ లైకా ప్రొడక్షన్స్‌తో అడ్డంగా వాదనకు దిగారని ప్రచారమైంది. వీరిని కాదని తెలుగులో విడుదల చేయడం కష్టం అని భావించిన నిర్మాత శుభాస్కరన్ తాజాగా దిగొచ్చారట. చివరికి ఈ పంచాయితీ వల్ల అతడు 4 కోట్లు వడ్డీ తిరిగి చెల్లించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదల చేయకుండానే డి.సురేష్ బాబు - సునీల్ నారంగ్ 4 కోట్లు లాభం ఆర్జించడం.. విడ్డూరంగా వుందని - 2.ఓ రిలీజ్‌కు కాకుండానే ఆ నిర్మాతకు 4 కోట్ల నష్టమా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. దటీజ్ బిజినెస్ గేమ్ అంటూ ట్రేడ్ లో చర్చ సాగుతోంది. డి.సురేష్ బాబు - సునీల్ నారంగ్ రూపంలో 2.ఓ నిర్మాతకు భారీ పంచ్ పడిందన్న ముచ్చటా సాగుతోంది.