Begin typing your search above and press return to search.

చరణ్‌ కోసం 4 కోట్లు పెట్టేశారు

By:  Tupaki Desk   |   13 Aug 2015 3:00 PM GMT
చరణ్‌ కోసం 4 కోట్లు పెట్టేశారు
X
రామ్‌ చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దసరా బరిలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టే శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం థాయ్‌ ల్యాండ్‌ లో క్లయిమాక్స్‌ షూట్‌ చేస్తున్నారు. 9 సినిమాల కెరీర్‌లోనే చెర్రీకి వెరీ స్పెషల్‌ క్లయిమాక్స్‌ ఇదే అవుతుందని అంటున్నారు.

ఈ క్లయిమాక్స్‌ ఫైట్‌ ని ఓ ఖరీదైన షిప్‌ లో తెరకెక్కిస్తున్నారు. షిప్‌ అద్దె రోజుకు 16 లక్షలు. 10రోజుల పాటు షూటింగ్‌ ఇందులోనే. ఈ క్లయిమాక్స్‌ కోసం నిర్మాత డి.వి.వి.దానయ్య ఏకంగా రూ.4కోట్లు ఖర్చు చేస్తున్నారు. చరణ్‌ ఓ స్టంట్‌మేన్‌. అందుకు తగ్గట్టే స్టంట్స్‌ అదిరిపోతాయని చెబుతున్నారు. రెగ్యులర్‌ స్టీరియో టైపిక్‌ వైట్ల తరహా చిత్రం కాదు ఇది. ఈసారి నేరేషన్‌ తో పాటు చరణ్‌ క్యారెక్టరైజేషన్‌ ఆసక్తికరంగా ఉంటుందని టాక్‌ వినిపిస్తోంది. చరణ్‌ ఈ సినిమా కోసం ప్రత్యేకించి బ్యాంకాక్‌, థాయ్‌ల్యాండ్‌ లో మార్షల్‌ ఆర్ట్స్‌ లో శిక్షణ తీసుకుని మరీ వచ్చాడు. స్టంట్స్‌ లో ప్రత్యేకత ఏంటో చూడాలనుకుంటే దసరా వరకూ ఆగాల్సిందే.