Begin typing your search above and press return to search.
2.47 గం.ల అఖండలో 45ని.ల యాక్షన్ సీన్స్
By: Tupaki Desk | 20 Nov 2021 5:04 AM GMTనటసింహా నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ అఖండ డిసెంబర్ లో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ పదిరోజులు మాత్రమే ప్రమోషన్స్ కి మిగిలి ఉంది. ఇంతలోనే ఈ సినిమాకి సెన్సార్ పూర్తయింది. సినిమాని వీక్షించిన సెన్సార్ బృందం యుఏ సర్టిఫికెట్ ఇచ్చింది.
నిజానికి బాలయ్య- బోయపాటి మాస్ సినిమాలకు యుఏ సర్టిఫికెట్ చాలా కామన్. ఈసారి కూడా అదే వచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ నిడివి 2.47 గం.లు ఉంటుందని తెలిసింది. ఇక ఇందులో 45 నిమిషాల నిడివితో యాక్షన్ ఘట్టాలు రక్తి కట్టిస్తాయని సమాచారం. ముఖ్యంగా బాలయ్య డ్యూయల్ షేడ్స్ మాస్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అని తెలిసింది. అలాగే అఘోరా పాత్రతో మైండ్ బ్లాక్ అయ్యే ట్రీట్ ఉంటుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే అఖండ ట్రైలర్ వీక్షించిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. బాలయ్య మార్క్ పంచ్ డైలాగులు యాక్షన్ కి కొదవేమీ లేదని అర్థమైంది. ఇందులో శ్రీకాంత్ - జగపతి పాత్రలు హైలైట్ గా నిలుస్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రగ్య జైశ్వాల్ అందచందాలు ప్రధాన అస్సెట్ కానున్నాయి. 2 గంటల 37 నిమిషాలతో ఫైనల్ కట్ తో సినిమా సిద్ధమైంది. ఇకపోతే బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లోనే వచ్చిన సింహా రన్ టైం 2 గంటల 36 నిమిషాలు కాగా..లెజెండ్ 2 గంటల 41 నిమిషాల నిడివితో వచ్చింది. సింహా- లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ హిట్ ని ఖాతాలో వేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న బోయపాటి టీమ్ ఇక ప్రచారంలో మరింత వేడి పెంచనుంది.