Begin typing your search above and press return to search.

బాప్ రే! 5 కోట్ల బడ్జెట్ మూవీ 25కోట్ల వ‌సూళ్లు!!

By:  Tupaki Desk   |   16 Nov 2022 4:23 AM GMT
బాప్ రే! 5 కోట్ల బడ్జెట్ మూవీ 25కోట్ల వ‌సూళ్లు!!
X
ఇటీవ‌ల బాలీవుడ్ కోలుకోలేని దెబ్బ తింది. అక్క‌డ అగ్ర హీరోలు న‌టించిన సినిమాలేవీ స‌రిగా ఆడ‌డం లేదు. ఇంచుమించు అదే ప‌రిస్థితి మ‌ల‌యాళంలో కూడా ఉంది. అక్క‌డ మోహన్ లాల్ వంటి పెద్ద స్టార్లు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు ఇవ్వడంతో ఇటీవల మాలీవుడ్ కూడా బ్యాడ్ ఫామ్ లో ఉంది. ఓవైపు క‌న్న‌డ నుంచి కేజీఎఫ్ - కాంతారా లాంటి సంచ‌ల‌న విజ‌యాలు ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు స్ఫూర్తిని నింపుతుంటే మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ అగ్ర హీరోలు ఇలాంటి ఫీట్ ని సాధించ‌లేక‌పోతున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

అయితే మలయాళ చిత్ర పరిశ్రమ ఎల్ల‌పుడూ ప్రత్యేకమైన కంటెంట్ -విభిన్న కథాంశాల ఎంపిక‌ల‌తో అవార్డుల ప‌రిశ్ర‌మ‌గా పాపుల‌రైంది. భారతీయ పరిశ్రమకు మాలీవుడ్ కొన్ని అద్భుతమైన చిర‌స్మ‌ర‌ణీయ‌మైన‌ చిత్రాలను అందిస్తోంది. చిన్న సినిమాలు మాలీవుడ్ లో గొప్ప విజ‌యాలు సాధిస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇటీవలే 'జయ జయ జయ జయ హే' అనే చిన్న చిత్రం విడుదలై ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది.

ప‌రిమిత బ‌డ్జెట్లో తెర‌కెక్కి మిరాకిల్స్ చేసింది ఈ చిత్రం. సుమారు 5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25 గ్రాస్ వసూలు చేసి అందరికి షాక్ ఇచ్చింది. మోహన్ లాల్ వంటి పెద్ద స్టార్లు బ్యాక్ టు డిజాస్ట‌ర్ల‌తో రేసులో వెన‌క‌బ‌డగా ఈ చిన్న సినిమా విజ‌యం గొప్ప స్ఫూర్తిని నింపుతోంది.

ప‌రిశ్ర‌మ ఏదైనా కంటెంటే కింగ్ అని హీరోలు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వేదిక‌ల‌పై ప్ర‌క‌టిస్తున్నారు. అది ప‌క్కాగా నిరూప‌ణ అవుతోంది. జయ జయ జయ జయ హే కంటెంట్ కింగ్ అని మరోసారి నిరూపించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. జయ జయ జయ జయ హే చిత్రంలో బాసిల్ జోసెఫ్- దర్శన రాజేంద్రన్ - అజు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు.

విపిన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ క‌థాంశం ఆస‌క్తిక‌రం. ఇది ఒక తీవ్రమైన సమస్యను వ్యంగ్య పంథాలో ఆవిష్క‌రించింది. హృదయం ఫేమ్ దర్శన మరోసారి ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయింది. లక్ష్మీ వారియర్ - గణేష్ మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మునుముందు మాలీవుడ్ లో మ‌రిన్ని ప్ర‌యోగాత్మ‌క సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇవ‌న్నీ పెద్ద తెర‌పై మ్యాజిక్ చేస్తాయ‌ని అంచ‌నాలున్నాయి. మ‌రోవైపు మ‌ల‌యాళంలో హిట్ సినిమాల‌ను 'ఆహా తెలుగు'లో అనువ‌దించి రిలీజ్ చేస్తుండ‌డంతో అవి తెలుగు రాష్ట్రాల్లోనూ ఇట్టే రీచ్ అయిపోతున్నాయి. మ‌ల‌యాళ డ‌బ్బింగుల‌కు ఇక్క‌డ కంటెంట్ ని బ‌ట్టే ఆద‌ర‌ణ ద‌క్కుతోంద‌ని ప్రూవ్ అవుతోంది. ఓటీటీ ఇప్పుడు సీన్ అంతా మార్చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మ‌రోవైపు పాన్ ఇండియా ట్రెండ్ కి కూడా ఇది ఊపును తెస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.