Begin typing your search above and press return to search.

కరోనా వల్ల ఆ యంగ్ హీరోకి 5 కోట్లు నష్టమంట..!

By:  Tupaki Desk   |   21 March 2020 2:30 AM GMT
కరోనా వల్ల ఆ యంగ్ హీరోకి 5 కోట్లు నష్టమంట..!
X
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం పెళ్లిళ్ల పైనా పడింది. విదేశాల్లో ఉంటూ వివాహాలు నిశ్చయం చేసుకున్న వారు స్వదేశాలకు రాలేక వాయిదా వేసుకుంటున్నారు. విదేశాలలో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న స్వదేశీయులు అక్కడికి వెళ్లే పరిస్థితిలేక పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా వల్ల ఇప్పుడు టాలీవుడ్ లో ఓ క్రేజీ జంట పెళ్ళికి ఇబ్బందులు ఏర్పడ్డాయట. ఇటీవలే తన గర్ల్ ఫ్రెండ్ తో నిశ్చితార్థం చేసుకున్న ఒక యువ హీరోకి కరోనా ప్రభావం వల్ల 5 కోట్ల వరకు నష్టం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయట. అదేంటి కరోనా వల్ల 5 కోట్ల నష్టం ఎలా జరిగిందని ఆలోచిస్తున్నారా..?, అయితే ఇప్పుడు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

ఇటీవల విడుదలైన తన సినిమా సూపర్ హిట్ అవడంతో మంచి ఊపుమీదున్న ఆ యువ హీరో అదే ఊపులో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. కొన్ని ఏళ్ళ నుండి డేటింగ్ చేస్తున్న తన గర్ల్ ఫ్రెండ్ ని తన భాగస్వామిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ సమ్మర్ సీజన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ పద్దతిలో అంగరంగ వైభవంగా దుబాయ్ లో తన వివాహ వేడుకలు చేసుకోవాలని అనుకున్నాడు. దీని కోసం దుబాయ్ లోని ఒక స్టార్ హోటల్ కి కోటి రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించి పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడట. అయితే అనుకోకుండా వచ్చి పడిన కరోనా కారణంగా విమానాలు రద్దు చేయబడి, దేశ విదేశాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అనుకున్న తేదీలలో పెళ్లి జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దుబాయ్ రూల్స్ ప్రకారం అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోగా, ఫంక్షన్ చేసుకున్నా చేసుకోకపోయినా మొత్తం డబ్బులు ఖచ్చితంగా చెల్లించాలంట. అనవసరంగా దుబాయ్ లో పెళ్లి ఆలోచన చేసుకున్నానని, ఇండియాలోనే గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటే బాగుండేది అని ఆ హీరో ఇప్పుడు బాధ పడుతున్నాడంట. ఇప్పుడు ప్రకటించిన తేదీలలో దుబాయ్ లో పెళ్లి చేసుకోలేక, ఇండియాలో మళ్ళీ పెళ్లి ఏర్పాట్లు చేసి ఖర్చు చేసుకోలేక తలలు పట్టుకుంటున్నాడంట.