Begin typing your search above and press return to search.
బాహుబలి2 దెబ్బకు 50 అరెస్టులు
By: Tupaki Desk | 30 April 2017 11:12 AM GMTబాహుబలి ది కంక్లూజన్ మూవీకి ముందు నుంచే విపరీతమైన క్రేజ్ ఉంది. బాహుబలి2 ట్రైలర్ రిలీజ్ నుంచి ఇది మరీ ఎక్కువైపోయింది. రిలీజ్ రోజు నాటికి డిమాండ్ పీక్ స్టేజ్ కి వెళ్లిపోయింది. తొలి రోజు సినిమా చూడ్డం అలవాటయిపోయిన జనాలకు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు.. జక్కన్న అభిమానులకు కూడా చాలా చోట్ల టికెట్స్ దొరకని పరిస్థితి కనిపించింది.
ప్రతీ ఏరియాలోనూ ప్రతీ థియేటర్లోనూ బాహుబలి2 టికెట్స్ కు విపరీతంగా డిమాండ్ కనిపించింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు పలు థియేటర్ వర్గాలు ప్రయత్నించాయి. బ్లాక్ మార్కెటింగ్ ను ప్రోత్సహించాయి కూడా. హైద్రాబాద్ లో ఈ బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువగా నడించిందనే ఆరోపణలు వినిపించాయి. 50 రూపాయల టికెట్ ను 300లకు.. 70 రూపాయల టికెట్ ను 400లకు అమ్ముతున్నారని పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందడంతో.. సమాచారాన్ని పక్కాగా పసిగట్టిన సైబరాబాద్ పోలీసులు.. పలు చోట్ల దాడులు జరిపి అరెస్టులు కూడా చేశారు. 500 టికెట్స్ తో పాటు వేల కొద్దీ క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.
థియేటర్ల మేనేజర్లతో సహా ఇప్పటివరకూ 50కి పైగా అరెస్టులు చేశారని తెలుస్తోంది. వీరందరిపైనా సినిమా రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం కేసులు బుక్ చేశారు. కొత్త సినిమాల రిలీజ్ సమయంలో రేట్లు పెంచడంపై సీరియస్ గా చర్యలు తీసుకుంటామని.. తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ విభాగం ముందుగానే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/