Begin typing your search above and press return to search.
50 కోట్ల క్లబ్ లో పుష్ప హిందీ వెర్షన్
By: Tupaki Desk | 1 Jan 2022 11:30 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టామినా ఎంతో పుష్ప ప్రూవ్ చేస్తోంది. రిలీజైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఆరంభం డివైడ్ టాక్ వచ్చినా కానీ క్రిస్మస్ సెలవులు ఈ సినిమాకి బాగా కలిసొచ్చాయి. ఇకపై సంక్రాంతి కలిసొస్తుందని టీమ్ అంచనా వేస్తోంది. ఓవైపు ఒమిక్రాన్ భయాలు పెరుగుతున్నా కానీ పుష్ప సహా తెలుగు సినిమాలకు దేశ విదేశాల్లో ఆదరణ దక్కడం పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తోంది. అఖండ తర్వాత పుష్ప -శ్యామ్ సింగరాయ్ చక్కని వసూళ్లతో ఆశల్ని పెంచాయి.
తాజాగా పుష్ప- హిందీ వెర్షన్ 50కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా శుక్రవారం నాడు రిస్ట్రిక్షన్స్ ఉన్నా థియేటర్లు మూత పడినా కానీ 3.5 కోట్ల మేర వసూల్ చేసి 15 రోజుల్లోనే హిందీ బెల్టులో 51.5 కోట్లు వసూల్ చేసింది.
15రోజుల తర్వాతా తగ్గేదేలే..!
`పుష్ప- ది రైజ్` మూడోవారం నుంచి నాలుగో వారంలోకి ప్రవేశించనుంది. ఇప్పటికీ ఈ చిత్రం డ్రాప్స్ ఉన్నా కానీ చక్కని వసూళ్లను సాధిస్తోంది. ఇంటా బయటా ఈ సినిమా సాధించిన వసూళ్లు హాట్ టాపిక్ గా మారాయి. పుష్ప-ది రైజ్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. పుష్ప హిందీ బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రన్ అవుతోంది. ఈ చిత్రం కొద్ది శాతం డిప్ ను నమోదు చేసినా కానీ ముంబై సర్క్యూట్ లో మంచి ప్రదర్శనను కొనసాగిస్తోంది. పుష్ప హిందీ వెర్షన్ 13 రోజుల్లో 45.5 కోట్లను వసూలు చేయగా.. 15రోజుల్లోనే 51.50కోట్లు వసూలు చేసింది.
అయితే అనూహ్యంగా ఒమిక్రాన్ పుష్పకు పంచ్ ఇస్తోంది. దిల్లీలో సినిమా థియేటర్లు మూతపడడంతో పుష్ప హిందీ కలెక్షన్లపై ప్రభావం పడింది. ట్రేడ్ విశ్లేషణ ప్రకారం.. పుష్ప హిందీకి మహారాష్ట్ర- గుజరాత్ ల నుంచి అత్యధికంగా 70 శాతం వసూళ్లు దక్కాయని తెలిసింది. రెండవ వారంలో పుష్ప హిందీ మొదటి వారం కలెక్షన్ కు దాదాపు 20 కోట్లను జోడించింది. మొదటి వారం కంటే 25 శాతం డ్రాప్ ను నమోదు చేసినా ఇది మంచి ఫలితం. మూడోవారం ఫర్వాలేదు. ఇకపై ఒమిక్రాన్ పంచ్ ఇబ్బందికరంగా మారుతోంది.
నిజానికి తెలుగు భాషను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ఇది. కానీ రాజమౌళి సలహాతో సుకుమార్ అండ్ టీమ్ మలయాళం- తమిళం- కన్నడ - హిందీ భాషల్లో విడుదల చేసే సాహసం చేసింది.. అల్లు అర్జున్- రష్మిక మందన్న- ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఎంటర్ టైనర్ కి సుకుమార్ రచన -దర్శకత్వం వహించారు. డిసెంబర్ 17న విడుదలైంది. రకరకాల వివాదాలతో ప్రచారం కూడా ఈ మూవీకి కలిసొచ్చిందనే చెప్పాలి.