Begin typing your search above and press return to search.

#RRRకి 50 కోట్లు వద్దన్నాడట!!

By:  Tupaki Desk   |   1 Jun 2018 6:20 AM GMT
#RRRకి 50 కోట్లు వద్దన్నాడట!!
X
రాబోయే చిత్రాలలో #RRR అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ అనడంలో సందేహం అక్కర్లేదు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడం.. ఎన్టీఆర్- రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న రియల్ మల్టీస్టారర్ మూవీ కావడంతో.. ఈ చిత్రంపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. #RRRను మొదట తక్కువ బడ్జెట్ లో చేస్తారని అనుకున్నారు కానీ.. 200 కోట్ల బడ్జెట్ అనే సంగతి నిర్మాత డీవీవీ దానయ్య చెప్పేశారు.

అసలు బడ్జెట్ ఎంతవుతుంది అనే విషయాన్ని పట్టించుకోవడం లేదని.. క్రేజీ ప్రాజెక్టు తీసి బ్లాక్ బస్టర్ కొట్టడమే లక్ష్యమని అన్నారు దానయ్య. అయితే.. ఈయనకు రీసెంట్ గా మరింత క్రేజీ ఆఫర్ వచ్చిందట. గతంలో పలు భారీ చిత్రాలు తీసిన ఓ బడా నిర్మాత.. దానయ్యకు 50 కోట్ల ఆఫర్ ఇచ్చారట. అంటే ఈ మొత్తం తీసుకుని.. రాజమౌళి-రామ్ చరణ్- ఎన్టీఆర్ మూవీని ఆయనకు ఇచ్చేయాలన్నది ఆ ప్రపోజల్ సారాంశంగా చెబుతున్నారు. 200 కోట్లు పెట్టి సినిమా తీసి లెక్కలు వేసుకోవడం.. స్ట్రెయిట్ గా 50 కోట్లు జేబులో వేసుకుని పక్కకు తప్పుకోవడం అన్నవి ఆయన ముందు నిలిచిన ఆప్షన్స్ కాగా.. సినిమా చేసేందుకే మొగ్గారట దానయ్య.

అసలు ఈ ప్రపోజల్ ను అంగీకరించే విధంగా ఏ సమయంలోను కనిపించలేదని టాక్. అయినా.. 200 కోట్లు పెట్టి సినిమా తీసిన తర్వాత.. ప్రస్తుతం రాజమౌళికి ఉన్న క్రేజ్ ప్రకారం కనీసం 500-600 కోట్లకు అమ్ముకోవచ్చు. అంటే 400 కోట్ల మిగులులో.. నాలుగో వంతు నిర్మాత షేర్ గా వచ్చినా మినిమం 100 కోట్ల ప్రాఫిట్ అన్నమాట. పైగా అన్నిటికీ మించి ఇంతటి క్రేజీ మూవీ తీసిన ప్రొడ్యూసర్ అనే గుర్తింపు ముందు.. ఈ కోట్లు ఒక లెక్కా చెప్పండి.