Begin typing your search above and press return to search.

పుష్ప రన్‌ టైమ్‌ వల్ల రూ.50 లక్షల షేర్‌ నష్టపోయాం

By:  Tupaki Desk   |   19 Dec 2021 7:15 AM GMT
పుష్ప రన్‌ టైమ్‌ వల్ల రూ.50 లక్షల షేర్‌ నష్టపోయాం
X
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు అయ్యి మిశ్రమ స్పందనతో వీకెండ్‌ అవ్వడం వల్ల భారీ వసూళ్లను దక్కించుకుంటుంది. మొదటి రోజు ఇయర్ బెస్ట్‌ వసూళ్లను నమోదు చేసిన పుష్ప రెండవ మరియు మూడవ రోజు కూడా వీకెండ్‌ అవ్వడం వల్ల కుమ్మేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా రికార్డు వసూళ్లను నమోదు చేస్తుంది అనే నమ్మకం మొదటి నుండి ఉంది. అన్నట్లుగానే ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో భారీ వసూళ్లను నమోదు చేయబోతుంది. సినిమా విడుదల అయిన తదుపరి రోజు అంటే శనివారం మైత్రి మూవీ నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సినిమా వస్తున్న స్పందనతో చాలా సంతోషంగా ఉన్నట్లుగా వారు పేర్కొన్నారు. ఇంత భారీ సినిమాను ఇంత తక్కువ సమయంలో విడుదలకు సిద్దం చేయడం చాలా కష్టంగా మారింది. చివరి నిమిషంలో ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. మలయాళంలో శనివారం నుండి మలయాళ వర్షన్ పుష్ప స్క్రీనింగ్‌ అవ్వబోతుంది. శుక్రవారం రోజు కేరళ మొత్తం కూడా తమిళ వర్షన్ పుష్ప ను ప్రదర్శించడం జరిగింది. అయినా కూడా అక్కడ నుండి మంచి రిపోర్ట్‌ లు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఉత్తరాది నుండి కూడా పుష్ప కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజు అంతగా వసూళ్లు నమోదు అవుతాయని మేము ఊహించలేదు. కచ్చితంగా ఇది మాకు భారీ ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ ఉత్సాహంతో పుష్ప 2 ను ఫిబ్రవరి లేదా మార్చి లో మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ సినిమా రన్ టైమ్‌ విషయంలో వస్తున్న విమర్శల విషయంలో నిర్మాతలు స్పందించారు. సినిమా కథను స్టార్ హీరోను.. భారీ స్టార్‌ కాస్ట్‌ ను సరిగ్గా చూపించాలంటే ఆమాత్రం రన్‌ టైమ్‌ తప్పనిసరి అనిపించింది. అందుకే మూడు గంటల రన్ టైమ్‌ ను ఖరారు చేసినట్లుగా వారు పేర్కొన్నారు. రన్‌ టైమ్‌ తక్కువగా ఉండి ఉంటే నైజాం ఏరియాలో మల్టీ ప్లెక్స్ లో అయిదవ షో పడేది. తద్వార మొదటి రోజు మాకు అదనంగా 50 లక్షల వరకు షేర్ వచ్చేదని.. రన్‌ టైమ్‌ ఎక్కువగా ఉండటం వల్ల తాము ఆ షేర్ ను కోల్పోయామని నిర్మాతల్లో ఒకరు పేర్కొన్నారు. సినిమా రన్‌ టైమ్‌ విషయంలో దర్శకుడు సరైన నిర్ణయం తీసుకున్నారు అనేది ఆయన ఉద్దేశ్యం. సినిమా తక్కువ రన్ టైమ్ తో విడుదల చేస్తే నిర్మాతలకు లాభమే.. కాని ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో సుకుమార్‌ మూడు గంటలు నిర్ణయించారు అనేది వారి వాదన.

పుష్ప సినిమా లో అల్లు అర్జున్ పాత్ర కు అభిమానుల నుండి నీరాజనాలు అందుతున్నాయి. అల్లు అర్జున్‌ కెరీర్‌ బెస్ట్ తో అభిమానులకు మంచి ట్రీట్‌ ఇచ్చాడు. రంగస్థలం వంటి విభిన్నమైన ఒక స్టోరీని ప్రేక్షకులకు చూపించాలని సుకుమార్‌ ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో చిన్న చిన్న తప్పిదాలు జరిగాయి అనేది విశ్లేషకుల మాట. పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా ను ఆ స్థాయిలో తీయలేక పోయారు అనేది కూడా కొందరిలో ఉన్న టాక్‌. సినిమా నిడివి విషయంలో జరుగుతున్న రచ్చ నేపథ్యంలో నేటి నుండి కాస్త నిడివిని తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయ. ఆ విషయమై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. మొత్తానికి పుష్ప సినిమా బన్నీ అభిమానులకు మంచి అనుభూతిని మిగిల్చింది.. కాని సమ్‌ థింగ్ ఈజ్ మిస్సింగ్‌ అన్నట్లుగా ఇతర ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.