Begin typing your search above and press return to search.

50 ల‌క్ష‌ల స‌బ్సిడీ.. టీవీ మూవీ ఇనిస్టిట్యూట్ ఆఫ‌ర్!

By:  Tupaki Desk   |   4 July 2021 3:59 AM GMT
50 ల‌క్ష‌ల స‌బ్సిడీ.. టీవీ మూవీ ఇనిస్టిట్యూట్ ఆఫ‌ర్!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌కు తెర తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్న‌డూ లేని విధంగా ఈసారి ఆరుగురు అభ్య‌ర్థులు మా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్నారు. అయితే ఇందులో సీనియ‌ర్ న‌టుడు.. న్యాయ‌వాది సీవీఎల్ న‌ర‌సింహారావు తెలంగాణ వాదాన్ని త‌లకెత్తుకోవ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఆయన మూవీ ఆర్టిస్టుల సంఘాన్ని రెండుగా విభ‌జించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. మా తెలంగాణ - మా ఆంధ్రాగా విభజించాల‌ని త‌ద్వారా తెలంగాణ క‌ళాకారుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు. తాను మా అధ్య‌క్ష ప‌ద‌విలోకి వ‌స్తే అంతర్జాతీయ ఫిల్మ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాన‌ని అన్నారు.ప్రతి తెలంగాణ సినిమాకు 50లక్షల సబ్సిడీ కూడా ఇస్తామని ప్రకటించారు.

అలాగే చిన్న సినిమాల‌కు వంతుల‌వారీగా కేటాయింపులు ఉండేలా తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేసేలా చేస్తాన‌ని అన్నారు. టీ-సినిమాలకు వినోద పన్ను మినహాయింపు ఉచిత లొకేష‌న్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్మిక చ‌ట్టాల్ని బ‌లోపేతం చేసి క‌ళాకారుల‌కు ఉప‌క‌రిస్తామ‌ని అన్నారు.

అయితే ఇదంతా ఎలా సాధ్యం? అంటే తెరాస‌పై 2023లో భాజ‌పా ప్ర‌భుత్వం గెలిస్తేనే అనే సంకేతాలు ఆయ‌న ఇచ్చారు. ఇప్ప‌టికే సీవీఎల్ భాజ‌పా నాయ‌కుడు. ఆయ‌న‌కు బీజేపీ మ‌ద్ధ‌తు ఉంది. ఆ క్ర‌మంలోనే ఆయన ఆర్టిస్టుల సంఘంలో డివైడ్ పాలిటిక్స్ న‌డిపించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆయ‌న వ‌రాల‌న్నీ ఘ‌నంగానే ఉన్నాయి. అయితే ఆచ‌ర‌ణ సాధ్యం కావాలంటే భాజ‌పా క‌చ్ఛితంగా తెలంగాణ‌లో అధికారంలోకి రావాలి. వ‌స్తుందా రాదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి. ఇక రెండుగా విభ‌జించాలి అన్నారు కాబ‌ట్టి ఆయ‌నకు అవ‌కాశాలిచ్చేది ఎవ‌రు? అన్న‌దానిపైన కూడా చ‌ర్చ మొద‌లైపోయింది.