Begin typing your search above and press return to search.
రిలీజ్ కి ముందే బాహుబలి2 పైరసీ
By: Tupaki Desk | 28 April 2017 4:37 AM GMTదేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించి.. విపరీతమైన హైప్ క్రియేట్ అయిన మూవీ బాహుబలి ది కంక్లూజన్. నిజానికి ఈ సినిమా రిలీజ్ డేట్ ఇవాళే. కానీ ముందు రోజు రాత్రి నుంచే స్పెషల్ షోస్ రూపంలో దీన్ని ప్రదర్శించేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను అనేక థియేటర్లలో ముందు రోజు రాత్రి సెకండ్ షోస్ గా బాహుబలి2నే ప్రదర్శించారు.
సినిమా రిజల్ట్ సంగతి ఇంకా తేలలేదు. దానికంటే ముందే నెట్ లోకి పైరసీ ప్రింట్ వచ్చేయడం యూనిట్ ను గందరగోళానికి గురి చేస్తోంది. తొలి 50 నిమిషాల సినిమా నెట్ లోకి వచ్చేసిందనే టాక్ ఇప్పుడు అందరినీ గందరగోళానికి గురి చేస్తోంది. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా.. మళ్లీ మళ్లీ అప్ లోడ్ అవుతూ అనేక మంది డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో డౌన్ లోడ్స్ జరిగాయని అంటున్నారు. పైరసీని నియంత్రించేందుకు సినిమా యూనిట్.. సైబర్ క్రైమ్ విభాగం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించలేదా??
సినిమా రిలీజ్ కి ముందే పైరసీ ప్రింట్ వాట్సాప్ లోకి కూడా వచ్చేయడం నిజంగా బాధాకరమైన విషయమే. ఈ పైరసీ వెనక ఎవరున్నారనే అంశంపై ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. ఐదేళ్లకుపైగా సమయాన్ని ఈ మూవీపై కేటాయించామని.. పైరసీని ప్రోత్సహించవద్దని బాహుబలి టీం విజ్ఞప్తి చేస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/