Begin typing your search above and press return to search.
50 ఏళ్ళ ‘కొడుకు కోడలు’.. ఏఎన్నార్ కెరీర్లో మైలురాయి..!
By: Tupaki Desk | 23 Dec 2022 12:30 AM GMTదివంగత ఎన్టీఆర్ సినీ కెరీర్లో ఎన్నో దిగ్గజ చిత్రాలు ఉన్నాయి. తన నటజీవితంలో చూడని బ్లాక్ బస్టర్ మూవీలు.. సిల్వర్ జూబ్లీ.. గోల్డెన్ జూబ్లీలు లేవంటే అతిశయోక్తి కాదేమో. ఇక ఆయన తన కెరీర్ తొలినాళ్లలో ఎంతోమంది సుప్రసిద్ధ దర్శకులలతో.. నటీనటులతో నటించారు. ఆయన మన మధ్య లేకపోయినా ఇప్పటికీ ఆ చిత్రరాజాల గురించి చాలామంది సీనియర్ సిటిజన్లు చెబుతూనే ఉంటారు.
అక్కినేని నాగేశ్వర్ రావు తొలిసారిగా 1941లో ‘ధర్మపత్ని’ మూవీతో వెండితెరపై కన్పించారు. ఈ సినిమాకు పి. పుల్లయ్య దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ‘అర్ధాంగి’.. ‘సిరిసంపదలు’.. ‘మురళీకృష్ణ’ సినిమాలు వచ్చాయి. ఇవన్నీ కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.
ఈ పరంపరలో 1972లో ఏఎన్ఆర్.. వాణిశ్రీ జంటగా ‘కొడుకు-కోడలు’ సినిమాను పి. పుల్లయ్య తెరకెక్కించారు. ఈ మూవీ 1972 డిసెంబర్ 22న విడుదలైంది. నేటితో ఈ మూవీ 50 ఏళ్లు(అర్ధ శతాబ్దం) పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా కథ ప్రేరణలో ఆ తర్వాతి కాలంలో ఎన్నో సినిమాలు వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
కొడుకు.. కోడలు మూవీలో దర్శకుడు పి.పుల్లయ్య సతీమణి శాంతకుమార్ ఏఎన్నార్ తల్లిగా నటించింది. ఎస్వీ రంగారవు.. గుమ్మడి.. లక్ష్మి.. కైకాల సత్యనారాయణ.. రాజబాబు.. రమప్రభ.. రమణారెడ్డి.. సూర్యకాంతం.. పీఆర్ వరలక్ష్మి.. నిర్మలమ్మ.. సిహెచ్ కృష్ణమూర్తి తదితరులు నటించారు. ఈ మూవీలో జగ్గయ్య అతిథి పాత్రలో కన్పించారు. ఆత్రేయ పాటలు.. మాటలు అందించగా కేవీ మహదేవన్ బాణీలను సమకూర్చారు.
ఈ మూవీలో ‘నువ్వు నేను ఏకమైనము..’.. ‘నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు..’.. ‘గొప్పోళ్ల చిన్నది..’ ‘నా కంటే చొన్నోడు..’.. ‘చేయి చేయి తగిలింది..’ వంటి పాటలు అప్పట్లో బాగా అలరించాయి. 1972లో రంగు రంగుల చిత్రాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ‘కొడుకు-కోడలు’ మూవీ సైతం అప్పట్లో రంగుల్లో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది.
ఈ స్టోరీ విషయానికొస్తే.. రాజశేఖర్.. శోభ ప్రేమించుకోగా శోభ తండ్రి శ్రీహరిరావు పెళ్లికి ఒప్పుకున్నాడు. అయితే నిశ్చితార్థం చేసుకునే సమయంలో శ్రీహరి రావు అక్క దుర్గమ్మ రాజశేఖర్ తల్లి జానకమ్మను చూసి పెళ్లి కాకుండానే బిడ్డకు కన్న మహాతల్లి అంటూ ఆడి పోసుకుంటుంది. ఈ క్రమంలో ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత ఈ విషయాన్ని రాజశేఖర్ జానకమ్మను నిలదీస్తాడు.
ఆమె కూడా దుర్గమ్మ చెప్పిందే నిజమని చెప్పడంతో కోపంతో రాజశేఖర్ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఓ అమ్మాయి ఒక నీచుడు మోసం చేయగా రాజశేఖర్ అతడికి బుద్ది చెబుతాడు. ఈ క్రమంలోనే అతడు రాజశేఖర్ పై కేసు పెడుతారు. ఈ కేసును రాఘవరావు జడ్జిగా ఉంటున్న కోర్టుకు వస్తుంది. ఈ క్రమంలోనే రాజశేఖర్ తన కొడుకేనని రాఘవరావు గుర్తిస్తాడు. విషయం చెప్పకుండా అతడిని తన ఇంటికి తీసుకెళ్లి ఆదరిస్తాడు.
ఇక శోభకు తన తండ్రి పెళ్లి చేసేందుకు యత్నించగా ఆమె ఇంటి నుంచి పారిపోతుంది. చెల్లెలు వరుస అయ్యే గీత దగ్గరకు చేరుకుంటుంది. రాఘవరావుకు గీత నర్సుగా సేవలు అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే గీతతో రాజశేఖర్ కు పెళ్లి చేయాలని రాఘవరావు ఆశిస్తాడు. ఇక చివరల్లో రాజశేఖర్.. శోభ ప్రేమించుకున్నారని గీత తెలిసి వారిద్దరి ఆమె పెళ్లి చేస్తుంది. కొడుకు.. కోడలును చూసుకొని రాఘవరావు దంపతులు మురిసిపోవడంతో కథ సుఖాంతమవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.