Begin typing your search above and press return to search.

మోడీ షాక్.. షూటింగ్ లకి బాగా దెబ్బ

By:  Tupaki Desk   |   9 Nov 2016 4:02 AM GMT
మోడీ షాక్.. షూటింగ్ లకి బాగా దెబ్బ
X
500.. 1000 నోట్లు రద్దు చేసేస్తున్నామంటూ ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద షాక్ నే ఇచ్చారు. బ్లాక్ మనీ అడ్డుకునే లక్ష్యంతో చేపట్టిన ఈ చర్య.. దేశంలోని ప్రతీ పరిశ్రమపై ప్రభావం చూపడం ఖాయం. ఇమ్మీడియేట్ గా ఎఫెక్ట్ అయ్యే రంగాల్లో సినీ రంగం కూడా ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ కి అయితే.. ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చంటున్నారు ట్రేడ్ జనాలు.

కనీస మాత్రంగా సమయం ఇవ్వకుండా.. గంటల వ్యవధిలో కరెన్సీ రద్దు చేసేయడంతో.. ఇప్పటికిప్పుడు కేవలం 100 రూపాయల డినామినేషన్ తో పెద్ద మొత్తాలను పోగు చేయడం అంటే.. ఎవరికైనా తలకుమించిన పనే. పైగా సినిమా ఇండస్ట్రీలో రోజువారి సెటిల్మెంట్స్ చాలానే ఉంటాయి. కార్మికుల వేతనాలు ఎక్కువగా ఈ రూపంలోనే పేమెంట్స్ అవుతూ ఉంటాయి. ఇదే అతి పెద్ద సమస్యగా పరిణమించే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ విషయానికొస్తే.. క్యాష్ పేమెంట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. బ్యాంకుల్లో డబ్బులు వేయడం.. చెక్కుల రూపంలో చెల్లించడం లాంటివి బాగా అరుదు.

బ్లాక్ మనీతో సినిమాలు తీస్తున్నారనే మాటలు కూడా చాలా రోజులుగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు అసలు 500.. 1000 నోట్లే చెల్లవని చెప్పేయడంతో వీటిని తీసుకునేందుకు ఎవరూ సాహసించరు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అనేక పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలపై ఈ ప్రభావం పడనుంది. కనీసం ఓ వారం పాటు షూటింగ్ లు.. షెడ్యుల్స్ డిస్టర్బ్ అయిపోవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/