Begin typing your search above and press return to search.

అరవిందలో ఐదుకు.. త్రివిక్రమ్ పెన్ను!

By:  Tupaki Desk   |   9 Oct 2018 10:22 AM GMT
అరవిందలో ఐదుకు.. త్రివిక్రమ్ పెన్ను!
X
'అరవింద సమేత' ఎల్లుండి విడుదల కానుంది. ఇప్పటికే సినిమాపై క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. సినిమా ఆడియో గురించి మాట్లాడుకుంటే అరవింద ఆల్బంలో 4 పాటలే ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఐదో పాట గురించి మీడియాలో కథనాలు వచ్చినా సినిమాలో అయితే లేదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.

ఐదో సాంగ్ ఉందట కానీ అది రెగ్యులర్ పాట కాదు. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ఆర్ ఆర్ బిట్ సాంగ్. మొదట్లో ఈ బిట్ సాంగ్ లేదట.. జస్ట్ ఆర్ ఆర్ బిట్ మాత్రమే ఉందట. కానీ లాస్ట్ మినిట్ లో త్రివిక్రమ్ తన మనసు మార్చుకుని ఆర్ ఆర్ బిట్ సాంగ్ అయితే సీన్ మరింతగా ఎలివేట్ అవుతుందని బిట్ సాంగ్ గా మార్చారట. సమయం తక్కువగా ఉండడంతో ఆ లిరిక్స్ కూడా తనే రాశారట. ఇక గురూజీ ఇచ్చిన రెండు లైన్ల సాహిత్యాన్ని థమన్ ఆలస్యం చేయకుండా ఒక చేత సింగర్ పాడించి సాంగ్ రెడీ చేయడం జరిగిందట.

త్రివిక్రమ్ కలం పదును అందరికీ తెలిసిందే కానీ పాటలలకు ఎప్పుడూ అయన దాన్ని వాడలేదు. ఇప్పుడు బిట్ సాంగ్ కు తన కలాన్ని వాడడం ఒక కొత్త విషయమే. మరి బిట్ సాంగ్ అయినా నార్మల్ సాంగ్ అయినా సాహిత్యం ఒకటే కదా. మరి మాటల మాంత్రికుడు ఎలాంటి పదవిన్యాసం చేశాడో వేచి చూడాలి.