Begin typing your search above and press return to search.
సెట్ల కోసం 6 కోట్లు పెట్టించిన భరత్
By: Tupaki Desk | 17 April 2018 6:22 PM IST‘భరత్ అనే నేను’ సినిమా విడుదల తేదీ దగ్గరయ్యే కొద్దీ సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు సినిమాలోని సెట్ల గురించి ఓ ఆసక్తికర సమాచారం బయటికొచ్చింది. ఇందులో రెండు ప్రత్యేక సెట్ల కోసం ఏకంగా ఆరు కోట్లు ఖర్చు చేశారట నిర్మాత డీవీవీ దానయ్య. అందులో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ సెట్ కూడా ఉండడం విశేషం.
‘భరత్ అనే నేను’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భరత్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేసే సన్నివేశాల నుంచి ఆయన పథకాలను- ప్రణాళికలను వెల్లడించేందకు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను చూపించేందుకు అసెంబ్లీ కావాలి. అందుకే ఈ ముఖ్యమంత్రి కోసం 2 కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీని తలపించే విధంగా ఓ అద్భుతమైన సెట్ వేశారట. అంతేకాకుండా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఓ రాయలసీమ గ్రామం సెట్ వేశారట. ఇందులో ‘వచ్చాడయ్యో సామీ’ సాంగ్ చిత్రీకరించారట. ఐదు రోజుల పాటు వందల మధ్య జూనియర్ ఆర్టిస్టుల మధ్య రాత్రి పూట చిత్రీకరించిన ఈ పాట సినిమాలో హైలెట్ అవుతుందని అంటున్నాడు దానయ్య.
ఇప్పటికే ప్రమోషన్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నాడు దానయ్య. ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారమే చిత్ర ప్రమోషన్ లో నిర్మాత కూడా బిజీ బిజీగా పాల్గొంటున్నాడు. కొరిటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘భరత్ అనే నేను’ ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.