Begin typing your search above and press return to search.
4 నిమిషాల 'బీస్ట్' పాటకు 6 నిమిషాల ప్రోమో
By: Tupaki Desk | 8 Feb 2022 8:51 AM GMTతమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా ప్రముఖ దర్శకుడు నెల్సన్ రూపొందించిన 'బీస్ట్' సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగు ఇంకా ఇతర సౌత్ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన బీస్ట్ సినిమా ను త్వరలో సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. తమిళ సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమా కు సంగీతాన్ని అందిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో కొలవెరిడీ సినిమా తో సెన్షేషన్ క్రియేట్ చేసిన అనిరుధ్ ఇప్పుడు సౌత్ లోనే టాప్ మ్యూజిక్ కంపోజర్ గా పేరు దక్కించుకున్నాడు. సూపర్ స్టార్ విజయ్ సినిమా ను అనిరుధ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బీస్ట్ నుండి ప్రేమికుల రోజు సందర్బంగా మొదటి పాటను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు.
విజయ్ గత చిత్రం మాస్టర్ కోసం అనిరుధ్ రవిచంద్రన్ ఇచ్చిన వాతి కమింగ్ ట్యూన్ భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా కుమ్మేసింది. అనిరుధ్ తాను సంగీతం ఇచ్చే ప్రతి సినిమాలో కూడా అలాంటి ఒక పాటను పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అనిరుధ్ ఆ తరహా పాటలను కుత్తు అంటాడు. తమిళంలో కుత్తు పాటలకు మంచి క్రేజ్ ఉంది. అనిరుధ్ నుండి వస్తే ఆ పాటలు మరో రేంజ్ అన్నట్లుగా ఉంటాయి. కనుక బీస్ట్ సినిమాలో కూడా అలాంటి ఒక పాటను ట్యూన్ చేయబోతున్నట్లుగా అనిరుధ్ ప్రకటించాడు. మొదటి పాటగా విడుదల చేయాలనుకుంటున్నది ఆ కుత్తు సాంగ్ అని అనిరుధ్ మరియు దర్శకుడు నెల్సన్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు చేసిన కుత్తు సాంగ్స్ తో పోల్చితే ఇది పూర్తి విభిన్నంగా విరుద్దంగా ఉంటుందని అనిరుధ్ చెప్పేశాడు. అరబిక్ కుత్తు సాంగ్ ను బీస్ట్ సినిమా కోసం అనిరుధ్ ప్లాన్ చేశాడు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీస్ట్ నుండి మొదటి పాటను ఈనెల 14న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడం కోసం పాటకు సంబంధించిన ప్రోమో ను విడుదల చేశారు. సాదారణంగా అయితే ప్రోమో రన్ టైమ్ 10 నుండి 30 సెకన్ల వరకు ఉంటుంది. కాని బీస్ట్ పాట ప్రోమో ఏకంగా ఆరు నిమిషాలు ఉంది. నాలుగు నిమిషాల పాట కోసం ఆరు నిమిషాల ప్రోమోను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.
ప్రోమోలో పాట నేపథ్యం ను చూపించారు. వీడియో లో బీస్ట్ మ్యూజిక్ గురించి అనిరుధ్ మరియు దర్శకుడు నెల్సన్ లు మాట్లాడుకుంటూ ఉండగా ఒక మంచి పాటను చేద్దాం అని అరబిక్ పాటను చేస్తానంటూ అనిరుధ్ అంటాడు. అందుకు మొదట కన్ఫ్యూజ్ అయ్యి ఆ తర్వాత అనిరుధ్ కన్విన్స్ చేయడంతో ఓకే చెప్తాడు. అరబిక్ కుత్తు సాంగ్ కు లిరిక్స్ కావాలని అనిరుద్ అనడంతో దర్శకుడు నెల్సన్ ఫోన్ చేసి శివ కార్తికేయన్ ను పిలుస్తాడు. అప్పుడు ముగ్గురు కూడా అరబిక్ గెటప్స్ వేసుకుని మూడ్ కోసం అంటూ సరదాగా కామెడీ చేశారు.

అరబిక్ కుత్తు పూర్తి చేసిన తర్వాత విజయ్ కి కాల్ చేయడం.. ఆయన అరబిక్ కుత్తు ఏంటీ అంటూ కౌంటర్ వేయడం మొత్తం వీడియో అంతా సరదాగా సాగి పోయింది. మొదటి పాట కోసం చేసిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాట పై జనాల్లో ఆసక్తిని పెంచుతోంది. వీడియో చివర్లో అరబిక్ ట్యూన్ తో పాటకు సంబంధించిన హింట్ ఇచ్చారు. మొత్తానికి తమిళ సినిమాలో అరబిక్ కుత్తు సాంగ్ ఏంటో అంటూ తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఫిబ్రవరి 14 తర్వాత ఈ పాట దేశవ్యాప్తంగా మారు మ్రోగడం ఖాయం అంటూ తమిళ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు. అనిరుద్ గతంలో చేసిన కుత్తు సాంగ్స్ అన్నింటిలోకి ఇది బెస్ట్ గా నిలుస్తుందని అంటున్నారు. తెలుగు లో కూడా విడుదల కాబోతున్న బీస్ట్ మూవీ ఏ స్థాయిలో ఇక్కడ మెప్పిస్తుంది అనేది చూడాలి.