Begin typing your search above and press return to search.

`మా` సీనియ‌ర్ స‌భ్యుల‌కు నెల‌కు 6 వేలు పెన్ష‌న్.. మెడిక‌ల్ ఫ్రీ చికిత్స‌

By:  Tupaki Desk   |   18 May 2021 1:42 PM GMT
`మా` సీనియ‌ర్ స‌భ్యుల‌కు నెల‌కు 6 వేలు పెన్ష‌న్.. మెడిక‌ల్ ఫ్రీ చికిత్స‌
X
ఓవైపు క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త అంత‌కంతకు భ‌య‌పెడుతోంది. సినీప‌రిశ్ర‌మ నుంచి చాలా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ఎంద‌రో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ స‌న్నివేశం నెల‌కొంది. ఇలాంటి స‌మ‌యంలో మెడి క్లెయిమ్ ప‌రంగా అసోసియేష‌న్ల త‌ర‌పున ఏదైనా స‌హ‌కారం అందుతోందా? ఆర్టిస్టుల‌కు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) స‌హ‌కారం ఎంత‌? అన్న‌ది ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిసాయి.

చాలావ‌ర‌కూ అసోసియేష‌న్ల‌లో మెంబ‌ర్ షిప్ కార్డులు ఉన్న‌వాళ్ల‌కు ఇన్సూరెన్స్ సౌక‌ర్యం ఉంది. మెడీక్లెయిమ్ యాక్సిడెంట‌ల్ ఇన్సూరెన్సులు ఉన్నాయి. సంఘం త‌ర‌పున ఈ క‌ష్ట కాలంలో అత్య‌వ‌స‌రంలో ఉన్న‌వారికి ఆర్థిక సాయం కూడా అంతో ఇంతో అందుతోంది. నిత్యావ‌స‌రాల సాయాలు అందిస్తున్నారు. ద‌ర్శ‌క‌సంఘం త‌ర‌పున త‌మ స‌భ్యుల‌కు అవ‌స‌రం మేర స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తున్నామ‌ని ఎన్.శంక‌ర్ ఇంత‌కుముందు వెల్ల‌డించారు. ఆప‌త్కాలంలో మెడిక‌ల్ ఎమెర్జెన్సీ కోసం స‌భ్యుల‌కు ల‌క్ష వ‌ర‌కూ సాయప‌డుతున్నామ‌ని తెలిపారు.

అలాగే మూవీ ఆర్టిస్టుల సంఘంలో మెంబ‌ర్ షిప్ కార్డ్ ఉన్న సీనియ‌ర్ స‌భ్యుల‌కు నెల‌కు రూ.6వేలు చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. వారికి మెడిక్లెయిమ్ ఇన్సూరెన్సె స‌దుపాయాలు ఉన్నాయి. ఇది ఈ క‌ష్ట‌కాలంలో పెద్ద సాయ‌మ‌వుతోంద‌ని తెలిసింది.

పావ‌ల శ్యామ‌ల వంటి సీనియ‌ర్ న‌టీమ‌ణి స‌రైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవి 2ల‌క్ష‌లు సాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. కుమార్తె శ్రీ‌జ చేతుల‌మీదుగా ఈ ఆర్థిక సాయం చేశారు. తాజా స‌మాచారం మేర‌కు.. మ‌రోసారి పావ‌ల శ్యామ‌ల ఉపాధి లేక ఈ క‌ష్ట‌కాలంలో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి త‌న‌ని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చారు.

అయితే పావ‌ల శ్యామ‌ల‌కు చాలా కాలంగా `మా` త‌ర‌పున స‌భ్య‌త్వ‌ కార్డ్ ను ఇచ్చి.. ఈసీ క‌మిటీ స‌భ్యులు కొంత సాయం చేయాల‌నుకున్నారు. నేడు స‌భ్య‌త్వ కార్డ్ తో పాటుగా.. మెగాస్టార్ ఆర్థిక విరాళం 101500 (1ల‌క్షా 1500) చెక్ ని అందించారు. ఇక‌పై కొత్త స‌భ్యురాలికి మెంబ‌ర్ షిప్ కార్డ్ తో నెల‌కు 6 వేలు.. ఇన్సూరెన్స్ మెడిక్లెయిమ్ ఉంటుంది. ఎవ‌రైనా ఆర్టిస్ట్ అకాల‌మ‌ర‌ణం చెందితే 3ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉంటుందని తెలిసింది. క్రైసిస్ కాలంలో ఎంద‌రో వెట‌ర‌న్ ఆర్టిస్టులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మాట నిజం. అలాంటి వారికి మా మెంబ‌ర్ షిప్ ఎంతో ఉప‌యుక్తం అని ప్రూవ్ అవుతోంది.