Begin typing your search above and press return to search.
6 ఏళ్ల 'బాహుబలి'.. సోషల్ మీడియాలో ప్రభాస్ స్పెషల్ పోస్ట్.. !
By: Tupaki Desk | 10 July 2021 8:30 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి దేశవిదేశాల్లో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ''బాహుబలి''. ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ కాస్తా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన 'బాహుబలి '.. తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ వెండితెర అద్భుతం.. ఎన్నో రికార్డులను చేరిపేసి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. సౌత్ సినిమాలకు కొత్త దారిని చూపించిన ఈ చిత్రం.. 'బాహుబలి - బిగినింగ్' & 'బాహుబలి - ది కన్‌క్లూజన్' అనే రెండు భాగాలుగా వచ్చి అశేష ప్రజాదరణ తెచ్చుకుంది.
'బాహుబలి-1' చిత్రం 2015 జూలై 10న విడుదలైంది. అంటే సరిగ్గా నేటికి 6 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తనకు ఓవర్ నైట్ స్టార్డమ్ ని తెచ్చిపెట్టి ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ ని చేసిన 'బాహుబలి' చిత్రాన్ని ప్రభాస్ గుర్తు చేసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో 'బాహుబలి' లో శివలింగం ఎత్తుకునే ఐకానిక్ ఫోటోని షేర్ చేశాడు డార్లింగ్. "#6YearsOfBaahubali.. దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా సినిమాటిక్ మ్యాజిక్ తరంగాలను సృష్టించిన చిత్ర బృందం ఇక్కడ ఉంది" అని పోస్ట్ చేసిన ప్రభాస్.. 'బాహుబలి' చిత్రానికి వర్క్ చేసిన వారందరినీ ట్యాగ్ చేశారు ప్రభాస్.
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'బాహుబలి' సినిమా రూ.500 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. 'మహేంద్ర బాహుబలి' 'అమరేంద్ర బాహుబలి' రెండు పాత్రల్లో ప్రభాస్ నటించగా.. భల్లాల దేవుడిగా రానా - దేవసేన గా అనుష్క - అవంతిక గా తమన్నా - శివగామిగా రమ్యకృష్ణ - కట్టప్ప గా సత్యరాజ్ - బిజ్జల దేవుడిగా నాజర్ నటించారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ దర్శకరచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ వర్క్ చేశారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ - దేవినేని ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.