Begin typing your search above and press return to search.
ఆ హీరో అరెస్ట్.. 60 కోట్ల నష్టం
By: Tupaki Desk | 12 July 2017 9:09 AM GMTఒక తప్పు చేసేటపుడు దాని పర్యవసానాలు ఆలోచిస్తే.. చాలా నేరాలు.. ఘోరాలు ఆగిపోతాయి. కానీ తప్పు చేసే వాళ్లెవ్వరికీ ఆ సమయంలో ఆ విచక్షణ ఉండదు. మలయాళ నటుడు దిలీప్ ఆ విచక్షణ కోల్పోవడం వల్లే ఇప్పుడు దారుణమైన స్థితికి చేరుకుని.. తనతో పాటు అనేకమంది జీవితాల్ని ప్రమాదంలోకి నెట్టేశాడంటున్నారు మలయాళ పరిశ్రమ జనాలు. ఒక స్టార్ నటి కిడ్నాప్.. లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో దిలీప్ ను సూత్రధారిగా భావించి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ముందు నుంచి దిలీప్ ప్రమేయంపై జనాల్లో సందేహాలున్నాయి. దిలీప్ అరెస్టు నేపథ్యంలో ఆ సందేహాలు రూఢి అయిపోయాయి. దీంతో సామాన్య జనం నుంచి పరిశ్రమ వ్యక్తుల వరకు అందరి నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు దిలీప్. అతడి వ్యక్తిగత జీవితంతో పాటు సినీ కెరీర్ మీదా ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. దిలీప్ ఇండస్ట్రీలో బలమైన వ్యక్తి కావడంతో పోలీసులు తొందరపడలేదు. అతడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సేకరించాకే అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. కేసు బలంగా ఉండటంతో ఇప్పుడిప్పుడే దీన్నుంచి దిలీప్ బయటపడే పరిస్థితి కనిపించడం లేదు.
నేరం రుజువైతే అతడికి పెద్ద శిక్షే పడుతుందని భావిస్తున్నారు. దీంతో దిలీప్ సినిమాల భవితవ్యం ప్రమాదంలో పడింది. అతను మధ్యలో వదిలేసిన సినిమాల పరిస్థితి అయోమయంగా మారింది. ఆ సినిమాలు పూర్తవడం కష్టమే. ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడి మొత్తం గంగలో కలిసినట్లే అంటున్నారు. దిలీప్ ఇప్పటికే పూర్తి చేసిన సినిమాలు కూడా విడుదలకు నోచుకునే అవకాశం లేదంటున్నారు. ఇలా దిలీప్ తో ముడిపడ్డ సినిమాల వల్ల నిర్మాతలకు రూ.60 కోట్ల దాకా నష్టం వాటిల్లనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.