Begin typing your search above and press return to search.

ఆరు ద‌శాబ్ధాల క‌మ‌లిజానికి హ్యాట్సాఫ్

By:  Tupaki Desk   |   12 Aug 2019 2:31 PM GMT
ఆరు ద‌శాబ్ధాల క‌మ‌లిజానికి హ్యాట్సాఫ్
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ సినీప్ర‌స్థానం గురించి ఏమ‌ని చెప్పాలి. ఆరు ద‌శాబ్ధాల సుదీర్ఘ ప‌య‌నంలో అలు పెర‌గ‌ని యోధుడిలా అత‌డు సినిమాకి చేసిన సేవ‌లు అనిత‌ర సాధ్యం అనే చెప్పాలి. ఆరేళ్ల వ‌య‌సులో బాల‌న‌టుడిగా సినీ ఆరంగేట్రం చేశారు. 1960లో `క‌ళాతుర్ క‌న్న‌మ్మ` అనే చిత్రం ద్వారా తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. తొలి సినిమాకే ఉత్త‌మ బాల‌న‌టుడి(డెబ్యూ)గా జాతీయ అవార్డ్ అందుకున్నారు. ఆ త‌ర్వాత చ‌రిత్ర తెలిసిందే. ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా అస‌మానంగా ఎదిగి ప్ర‌పంచంలోనే గొప్ప‌ విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు.

భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో టాప్ 10 లెజెండ‌రీ స్టార్స్ జాబితా తిరగేస్తే అందులో క‌మ‌ల్ హాస‌న్ పేరు విన‌బ‌డాల్సిందే. అంత గొప్ప ప్ర‌తిభావంతుడిగా అత‌డి పేరు తెచ్చుకున్నారు. జెమిని గ‌ణేష‌న్.. సావిత్రి లాంటి దిగ్గ‌జాల‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న క‌మ‌ల్ .. వ‌ర్త‌మానంలో ఎన్టీఆర్.. ఏఎన్నార్.. దాస‌రి వంటి ప్ర‌ముఖుల‌తోనూ అనుబంధం కొన‌సాగించారు. ర‌జ‌నీ- చిరంజీవి- అమితాబ్ వంటి స్టార్ల‌తో పాటు కెరీర్ జర్నీ సాగించారు.

క‌మ‌ల్ హాస‌న్ లోని ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం గురించి తెలిసిందే. న‌టుడు - ద‌ర్శ‌కుడు- ర‌చ‌యిత‌- నిర్మాత‌- కొరియోగ్రాఫ‌ర్ ఒక‌టేమిటి క‌మ‌ల్ హాస‌న్ కి 24 శాఖ‌ల్లో తెలీని విద్య లేనేలేదు. ఇప్ప‌టికి దాదాపు 240 చిత్రాల్లో న‌టించారు. ఇటీవ‌ల‌ `మ‌క్క‌ల్ నీది మ‌య్యం` అనే పార్టీని స్థాపించి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన క‌మ‌ల్ అక్క‌డా అంతే దూకుడుగా దూసుకెళుతున్నారు. ఈ ఏడాదితో ఆయ‌న సినీకెరీర్ 60 ద‌శాబ్ధాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అభిమానులు ``60 పాత్ బ్రేకింగ్ ఇయ‌ర్స్ ఆఫ్ క‌మ‌ల్ హాస‌న్`` పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేస్తున్నారు. ఆరు ద‌శాబ్ధాల్లో ఆల్ రౌండ‌ర్ గా సినీప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న సాధించ‌నిది ఏం ఉంది? స్ప‌ష్ట‌మైన మార్పు కోరుతూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఇప్పుడు రాజ‌కీయాల్లోనూ ఆయ‌న ఆశించిన ఎత్తుల‌కు ఎద‌గాల‌నే ఆకాంక్షిద్దాం.