Begin typing your search above and press return to search.
ఒక్క సీన్ కోసం 600 డ్రెస్సులా
By: Tupaki Desk | 5 July 2017 5:00 AM GMTప్రస్తుతం సెట్స్ పై ఉన్న హాలీవుడ్ సినిమాల్లో విక్టోరియా అండ్ అబ్దుల్ ఒకటి. బ్రిటిష్- అమెరికన్ బయోగ్రాఫికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. క్వీన్ విక్టోరియా-ఆమెకు చెందిన భారతీయ సేవకుడు అబ్దుల్ కరీం మధ్య అనుబంధాన్ని చూపించబోతున్నారు.
విక్టోరియాగా జూడి డెంచ్ నటిస్తుండగా.. అబ్దుల్ కరీం పాత్రలో అలీ ఫజల్ యాక్ట్ చేస్తున్నాడు. ఇటు ఇండియాతో పాటు.. బ్రిటన్ లోను ఎక్కువ భాగం షూట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 15న యూకే లోను.. 22న అమెరికాలోను విడుదల చేయనున్నారు. అయితే.. ఈమూవీలో ఓ సన్నివేశానికి సంబంధించిన అప్ డేట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక్క సన్నివేశం కోసం ఏకంగా 600 కాస్ట్యూమ్స్ ను ఉపయోగించాల్సి వచ్చిందట. 18వ శతాబ్దం నాటి బ్రిటిష్ పాలన ఆధారంగా ఈ చిత్రం ఉండనుంది.
విక్టోరియాకు సేవలు అందించేందుకు గాను.. అబ్దుల్ ను ఇంగ్లాండ్ కు పంపుతారు బ్రిటిషర్లు. అక్కడ మహారాణికి సేవలు చేస్తూనే.. ఆమెకు సలహాలు ఇస్తూ ఒక ఫ్రెండ్ గాను.. గైడ్ గాను.. గురువుగాను మారిపోతాడు అబ్దుల్. ఈ కాలం నాటికి తగినట్లుగా కాస్ట్యూమ్స్ ఉండేలా జాగ్రత్త పడాల్సి ఉండడంతో.. సుదీర్ఘంగా సాగే ఒక్క సన్నివేశం కోసం 600 డ్రస్సులు ఉపయోగించాల్సి వచ్చిందట. ఆస్కార్ నామినేషన్ పొందిన ఐర్లాండ్ లేడీ కాన్సొలాటా బోయిల్.. విక్టోరియా అండ్ అబ్దుల్ కు కాస్ట్యూమ్ డిజైన్ చేయడం విశేషం.