Begin typing your search above and press return to search.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 63 అడుగుల 'శ్యామ్ సింగ రాయ్' కటౌట్..!

By:  Tupaki Desk   |   22 Dec 2021 4:34 AM GMT
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 63 అడుగుల శ్యామ్ సింగ రాయ్ కటౌట్..!
X
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదిగిన హీరో నాని. వైవిధ్యమైన కథలతో తనదైన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నాని. వరుస విజయాలతో మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్న నాని.. సినిమా సినిమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్నారు.

నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'శ్యామ్ సింగ రాయ్' క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో RTC క్రాస్ రోడ్స్ లోని దేవి 70MM ఈ చిత్రానికి మెయిన్ థియేటర్. గడిచిన రెండేళ్లలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న నాని సినిమా ఇదే. నేచురల్ స్టార్ చివరి రెండు సినిమాలు నేరుగా ఓటీటీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

రెండేళ్ల తర్వాత నాని హీరోగా నటించిన సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానులు సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు. ఇందులో భాగంగా దేవి థియేటర్ వద్ద 63 అడుగుల భారీ 'శ్యామ్ సింగరాయ్' కటౌట్ ను ఏర్పాటు చేశారు. అంతేకాదు నాని కటౌట్ ముందు పెద్ద ఎత్తున క్రాకర్లు కాల్చి పూల వర్షం కురిపించారు. అన్ని థియేటర్లలో ఈ సినిమా FDFS కోసం సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరుగబోతున్నాయని అర్థం అవుతోంది.

'శ్యామ్ సింగ రాయ్' చిత్రాన్ని దక్షిణాది బాషలైన తెలుగు తమిళ మలయాళ కన్నడలలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్.. ఇతర భాషల్లో కూడా సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. నాని స్వయంగా తమిళనాడు - కేరళ - కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి ప్రెస్ మీట్స్ మరియు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఇప్పటికే 'శ్యామ్ సింగ రాయ్' సినిమా నుంచి విడుదలైన టీజర్ - ట్రైలర్ - పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసిందని చెప్పాలి. రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఇందులో నాని రెండు పాత్రల్లో కనిపించనున్నారు. సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. సత్యదేవ్ జంగా అందించిన కథతో రూపొందిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

హీరో నాని ఈ సినిమాపై చాలా ధీమాగా ఉన్నారు. అందుకే ఈసారి క్రిస్మస్ మనదే అని నమ్మకంగా చెబుతున్నారు. 'వి' 'టక్ జగదీష్' సినిమాలను ఓటీటీలో విడుదల చేసిన నాని కి.. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ అవుతున్న 'శ్యామ్ సింగరాయ్' చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.