Begin typing your search above and press return to search.
వైభవంగా 68వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం.. మెరిసిన మనోళ్లు
By: Tupaki Desk | 1 Oct 2022 5:10 AM GMTఇండియన్ సినీ సెలబ్రెటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డులను ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా 68వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను అందజేశారు.
ఈసారి మన తెలుగు వారికి.. తెలుగు సినిమాలకు మరియు సౌత్ సినిమాలకు మంచి ప్రాముఖ్యత దక్కింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో సినిమా సంగీత దర్శకుడు థమన్ కి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు దక్కింది. ఇక ప్రాంతీయ తెలుగు భాష చిత్రంగా కలర్ ఫోటో కి అవార్డు దక్కింది. చిత్ర దర్శకుడు అవార్డును అందుకున్నారు.
ఇక నాట్యం సినిమాకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును సంధ్య రాజు అందుకున్నారు. ఇక సూరారై పొట్రు సినిమాకు అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడిగా సూర్య అవార్డును దక్కించుకున్నాడు. అంతే కాకుండా ఉత్తమ చిత్రంగా కూడా సూరారై పొట్రు నిలిచింది. జ్యోతిక నిర్మాతగా అవార్డును సూరారై పొట్రు ఉత్తమ చిత్రం అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
ఇక సూరారై పొట్రు లో నటించిన హీరోయిన్ బాలమురళి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నారు.
ఇక ఉత్తమ దర్శకుడిగా అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు గాను శచి తరపున ఆయన సన్నిహితులు అవార్డును అందుకున్నారు. ఇటీవలే శచి మృతి చెందిన విషయం తెల్సిందే.
ఈసారి సౌత్ ఇండియన్ సినిమాల సందడి జాతీయ అవార్డుల వేడుక సందర్భంగా కనిపించింది. ఎప్పటి మాదిరిగానే బాలీవుడ్ సినిమాల జోరు కూడా ఈసారి కనిపించింది. హిందీ నటుడు అజయ్ దేవగన్ ఉత్తమ నటుడు అవార్డును సూర్య తో కలిసి అందుకున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.