Begin typing your search above and press return to search.

టైమ్ ట్రావెల్ మూవీ 7:11.. టీజర్ ఎలా ఉందంటే..

By:  Tupaki Desk   |   7 Jun 2023 1:42 PM GMT
టైమ్ ట్రావెల్ మూవీ 7:11.. టీజర్ ఎలా ఉందంటే..
X
మంచి కంటెంట్ ఉండాలి కానీ, ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఓ సినిమా రెడీ అయ్యింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే మూవీ 7:11. సినిమా పేరు భిన్నంగా ఉన్నట్లే, మూవీ కూడా చాలా భిన్నంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ఓ పాట విడుదల చేయగా, అది మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా, తాజా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగడం విశేషం. ఈ టీజర్ ని ప్రముఖ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని విడుల చేయడం విశేషం.

సాహస్, దీపికా లు ఈ మూవీలో జంటగా నటిస్తున్నారు. వీరిద్దరూ కొత్తవారు కావడం విశేషం. పేరుకు కొత్తవారైనా నటనలో మాత్రం అదరగొట్టారని తెలుస్తోంది. ఈ సినిమాకి చైతు మాదాల దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని కొత్త కథాంశంతో ఈ మూవీని తెరెక్కించారు. టీజర్ చూస్తుంటే ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది. టీజర్ లో మూవీలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు.

ఈ మూవీ కథ విషయానికి వస్తే 1999లో జరిగినట్లుగా చూపిస్తారు. ప్రజెంట్, ఫ్యూచర్ మధ్య జరిగే టైమ్ ట్రావెల్ కథలా సాగుతుంది. ముఖ్యంగా హంసలదీవి అనే పట్టణం గురించి ఈ మూవీ కథ ఆధారపడి ఉంటుంది. 400 సంవత్సరాలలో వేరే గ్రహం నుండి భవిష్యత్తులో మానవుల మనుగడకు కీలకమైన సమాధానాల కోసం హంసలదీవి అనే పట్టణానికి చేరుకుంటారు.

ఒకేసారి రెండు టైమ్స్ ప్రకారం కథ సాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది. ఈ సినిమాకి 7:11 టైమ్ కి ఏంటి సంబంధం అనే విషయాలు తెలియాలంటే మూవీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. టీజరే ఇంత ఆసక్తికరంగా ఉందంటే, ఇక మూవీ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తి కనపరుస్తున్నారు.

నిజానికి ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా బడ్జెట్ అవుతుంది. కానీ పరిమిత బడ్జెట్‌తో, అనుభవం లేని నటీనటులు , చాలా తక్కువ సాంకేతిక నిపుణులతో ఇటువంటి సెన్స్ ఫిక్షన్ తెరకెక్కించడం చాలా గొప్ప విషయం. అయితే, దాని కోసం చిత్ర బృందం చాలా కష్టపడింది. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కతుందని వారు ఆవిస్తున్నారు.

ఆర్కస్ ఫిల్మ్స్ పతాకంపై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి ఈ మూవీని నిర్మించారు.ఈ చిత్రానికి శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో సినిమాటోగ్రఫీని నిర్వహించగా, శ్రీను తోట ఎడిటర్ గా వ్యవహరించారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసువచ్చే అవకాశం ఉంది.