Begin typing your search above and press return to search.
18 నెలల్లో 7 ఖండాలు.. 62 దేశాలు ప్లాన్!
By: Tupaki Desk | 20 Oct 2022 12:30 AM GMTచేతిలో బైకుంటే చాలు తల అజిత్ కి టైమ్ తెలియదు. ఎంత దూరమైనా...ఎన్ని వందల..వేల కిలోమీటర్లైనా సునాయాసంగా జర్నీ చేస్తారు. బైక్ రైడింగ్ చిన్న నాటి నుంచి హాబీ. అందుకే షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికినా చుట్టు పక్కల ప్రాంతాల్ని బైక్ పై చుట్టేస్తారు. ఇప్పటికే బైక్ పై ఇండియా మొత్తం చుట్టేసారు. రష్యాలో సైతం బైక్ పై చక్కెర్లు కొట్టారు.
అక్కడ ఏకంగా ఐదువేల కిలోమీటర్లనే బైక్ పై జర్నీ చేసి రికార్డు సృష్టించారు. ప్రపంచ యాత్రకు సైతం రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అందుకు సమయం ఆసన్నమైంది. ఆయన ఏకంగా 18 నెలల్లో 7 ఖండాలు.. 62 దేశాలను చుట్టేలా ఓ సుదీర్ఘ బైక్ జర్నీకి ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకోసం ముందస్తు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆ ఖండాలేంటి? ఏ దేశాలు వెళ్లనున్నారు వంటి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
అలాగే కారు జర్నీ అయినా అంతే ఇష్టం. ఏరో మోడలింగ్ కార్ రేస్.. బైక్ రేస్‌పై అజీత్ పట్టు సాధించారు. కొన్ని నెలల కిందట ఇండియాలో సుమారు 10800 కిమీలు ప్రయాణించారు. ఇటీవల రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించారు. జాతీయ స్థాయి పోటీలకు సైతం అర్హత సాదించడం గమనార్హం.
ఇక నటుడిగా అజిత్ స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటూ ఇమేజ్ ని రెట్టింపు చేసుకుంటున్నారు. `వలిమై`తో భారీ సక్సెస్ అందుకునే అదే దర్శకుడు హెచ్ .
వినోధ్ తో మరో సినిమా చేస్తున్నారు. `తుణివు` టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీ సంక్రాంతికి తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇటీవలి కాలంలో అజిత్ హిట్లు ఇతర భాషల్లోనూ రీమేక్ అవుతున్నాయి. బాలీవుడ్ సైతం అజిత్ సినిమాలపై కన్నేసింది. ఇటీవలే అక్కడ `విక్రమ్ వేద` కూడా రీమేక్ అయిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.