Begin typing your search above and press return to search.
'7 డేస్ 6 నైట్స్' రిలీజ్ ట్రైలర్: యూత్ ని టార్గెట్ చేస్తున్న ఎంఎస్ రాజు..!
By: Tupaki Desk | 20 Jun 2022 11:30 AM GMTటాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ''7 డేస్ 6 నైట్స్'' మూవీ రిలీజ్ కు రెడీ అయింది. న్యూ ఏజ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
'7 డేస్ 6 నైట్స్' సినిమాలో ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ మరియు రోహన్ హీరోలుగా నటించగా.. మెహర్ చావల్ - కృతికా శెట్టి హీరోయిన్లుగా చేశారు. ఇప్పటికే రిలీజ్ చేయబడిన ప్రచార చిత్రాలు - టీజర్ మరియు రెండు ట్రైలర్లు యూత్ ఆడియన్స్ ని బాగా ఆకర్షించాయి.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నకొద్దీ బ్యాక్ టు బ్యాక్ ప్రోమోలను వదులుతున్న మేకర్స్.. తాజాగా '7 డేస్ 6 నైట్స్' సినిమా నుంచి మూడో ట్రైలర్ ను విడుదల చేసారు. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ మరియు సిట్యుయేషనల్ కామెడీతో కూడిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
గోవా నేపథ్యంలో బ్యాచిలర్ ట్రిప్ కోసం వెళ్లిన ఇద్దరు యువకులకు.. అక్కడ పరిచయమైన ఇద్దరు యువతులకు మధ్య సాగిన రొమాంటిక్ జర్నీని ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. హీరోహీరోయిన్ల క్యారెక్టరైజేషన్లు - డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరియు అందమైన లొకేషన్లు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
హీరో సుమంత్ అశ్విన్ కొత్త లుక్ లో కనిపించాడు. చివర్లో నా బండి బోర్ కు వచ్చిందంటూ నవ్వించాడు. మరో హీరో రోహన్ కూడా అలరిస్తున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి చూస్తే.. యూత్ ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉందనిపిస్తోంది.
అందులోనూ 'డర్టీ హరి' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత ఎంఎస్ రాజు తీసిన సినిమాపై కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. మరి '7 డేస్ 6 నైట్స్' చిత్రంతో దర్శకుడిగా సీనియర్ నిర్మాత ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుమంత్ అశ్విన్ మరియు ఎస్. రజనీకాంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వింటేజ్ పిక్చర్స్ & ఏబీజీ క్రియేషన్స్ సంస్థలు కో ప్రొడ్యూసింగ్ చేసాయి. సమర్థ్ గొల్లపూడి సంగీతం సమకూర్చగా.. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ అందించారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ వర్క్ చేశారు.