Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 7 to 4
By: Tupaki Desk | 2 April 2016 1:56 PM GMTమూవీ రివ్యూ: 7 to 4
నటీనటులు : ఆనంద్ బచ్చు - రాజ్ బాలా - రాధికా - లౌక్య తదితరులు
సంగీతం : స్నేహలతా మురళి
సినిమాటోగ్రాఫర్: ప్రభాత్
కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: విజయ్ శేఖర్ సంక్రాంతి
ఇప్పటి వరకు కోలీవుడ్ లోనే మనం కొన్ని వెరైటీ టైటిల్స్ చూసుంటాం. సంఖ్యల పేరుతో వచ్చే టైటిల్స్ అక్కడే ఎక్కవ. కానీ తెలుగులో కూడా ఇలాంటి టైటిల్ తో ఓ సినిమా విడుదలైంది. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పేరు ‘7 to 4’. అబ్బాయిలు జాగ్రత్త అనేది ఉపశీర్షిక. క్రైం థ్రిల్లర్ మూవీస్ ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కు బాగానే ఉంటాయి. వాటిని కరెక్ట్ గా తీయగలిగితే.. ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమానే ఓ సామాజిక కోణంలో తెరమీదకెక్కిస్తే... ఎలా వుంటుందని భావించి.. తెరకెక్కించాడు దర్శకుడు విజయ్ శేఖర్ సంక్రాంతి. తనే స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. మరి ఈ క్రైం థ్రిల్లర్ ఎలా అలరించిందో తెలుసుకుందామా?
కథ:
నరసింహా(ఆనంద్ బచ్చు)... రవి (రాజ్ బాలా)... దుర్గ(లౌక్య)... లిల్లీ(రాధికా) నలుగురు కలిసి ‘వైట్ టైగర్స్ సొసైటీ’ అనే ఓ సంస్థను స్థాపించి... సిటీలో అమ్మాయిలను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించే ఆకతాయలను పట్టుకుని చిత్ర.. విచిత్రమైన శిక్షలు విధిస్తూ వుంటారు. రాత్రి వేళల్లో ఉద్యోగాలు చేసే మహిళలను టార్గెట్ గా చేస్తున్న కొంత మంది కిడ్నాపర్లను పట్టుకొని తమదైనశైలిలో శిక్షలు విధిస్తోంటోంది ఈ నలుగురి బృందం. అయితే ఓ కరుడు గట్టిన టీమ్ మాత్రం వీరి కంట పడకుండా తప్పించుకుని తిరుగుతూ మహిళలను కిడ్నాప్ చేస్తూ వుంటుంది. వారిని పట్టుకోవడానికి ఈ టీమ్ శత విధాలా ట్రై చేస్తూ వుంటుంది. రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారు జామున 4 వరకు జరిగే ఈ స్టోరీలో.. ఆ కిడ్నాపర్లు ఎవరికోసం అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారు? ఆ కిడ్నాపర్ల ముఠాను వైట్ టైగర్స్ సొసైటీ పట్టుకుందా? చివరకు వారిని ఏం చేశారనేదే మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
మెట్రో పాలిటన్ నగరాల్లో విమెన్ ట్రాఫికింగ్ ఎలా వుంటుందో... నిత్యం మన చుట్టూ జరుగుతున్న సంఘటనలే నిదర్శనం. లేట్ నైట్ ఆఫీసుకెళ్లొచ్చే అమ్మాయిలకు తగిన రక్షణ అనేదే కరువు. అలాంటి అమ్మాయిలను రక్షించడానికి ప్రభుత్వాలు.. పోలీసు వ్యవస్థ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... నిత్యం ఏదో ఒక చోట కిడ్నాపులు... అత్యాచారాలు జరుగుతూనే వుంటాయి. అమ్మాయిలను కిడ్నాప్ చేయడం.. వారిని లైంగికంగా వాడుకుని హత్య చేయడం లాంటి సంఘటనలు హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో సంచలనం రేపుతుంటాయి. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా... వీటికి అడ్డుకట్ట వేసే వారే లేరా? అసలు పోలీసులు ఏం చేస్తున్నారంటూ? కాసేపు కోప్పడటం తప్ప... ఏమీ చేయలేని నిస్సాహాయ స్థితి. అలాంటి వారి పని పట్టడానికే ఈ సినిమాలో ‘వైట్ టైగర్స్ సొసైటీ’ కింద ఓ నలుగురు వ్యక్తులు పనిచేస్తూ... కీచకుల పని పడుతుంటారు.
అయితే వీరు వేసే శిక్షలు కొంత కఠినంగా వున్నా... వాటిని చూపించిన విధానం కాస్త కటువుగా వున్నా... గతంలో మనం చూసిన సంఘటనలు గుర్తొస్తే.. అలాంటి వారికి తగిన శాస్తే జరగాలిలే అనుకుంటాం. ఈ చిత్ర దర్శకుడు ఈ సినిమా తీయడానికి ఎంచుకున్న స్టోరీ లైనే సినిమాకు ప్రధాన బలం. ప్రస్తుతం సమాజాన్ని కుదిపేస్తోన్న అత్యాచారాలపై ఓ టీమ్ చేసే పోరాటంతో కథ చెప్పాలన్న ప్రయత్నం అభినందనీయం. ఇక ఆ కథను ఒకేరాత్రిలో జరిగే వివిధ సంఘటనలతో చెప్పడం కూడా బాగుంది. అత్యాచారాలకు పాల్పడేవారికి వేసే శిక్షలు కొంత ఇబ్బంది కరంగా వున్నా... కమర్షియల్ చిత్రాలు చూసి ఇష్టపడే వారికి నచ్చుతుంది.
అయితే కథలో ఒక పాయింట్ చుట్టూనే పాత్రలన్నీ తిరుగడం వల్ల.. సినిమా కొంత ఫ్లాట్ గా నడుస్తున్నట్టనిపిస్తుంది. అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న ముఠా... ఫాం హౌస్ లో వున్న ఓ వ్యక్తికి సరఫరా చేస్తోందనే విషయాన్ని క్లైమాక్స్ లో తేల్చేశారు. మరింత డెప్త్ గా క్లైమాక్స్ వుండివుంటే ప్రేక్షకులు మరింత థ్రిల్ కు గురయ్యే వారు. ఈ చిత్రంలో కొంత పేరున్న నటులు నటించి వుంటే బాగుండేది. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలను ఎంత తక్కవ టైంలో ముగిస్తే అంత మంచిదని భావించి కేవలం ఒకటిన్నర గంటలోనే సినిమాకు శుభం కార్డు వేసేయడం బాగుంది. క్రైం థ్రిల్లర్ మూవీలను చూసి ఎంజాయ్ చేసే ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఈ సినిమా నచ్చుతుంది(పెద్దలకు మాత్రమే).
నటీనటులు:
ఆనంద్ బచ్చు-రాజ్ బాలా-లౌక్య-రాధిక... నలుగురు కొత్తవారే. ఆనంద్ బచ్చు టీమ్ ను లీడ్ చేసే పాత్రలో బాగా ఒదిగిపోయాడు. అతనికి సహాయకుడిగా రాజ్ బాలా నటించారు. ఇది కేవలం ఇన్వెస్టిగేషన్ క్రైం థ్రిల్లర్ కాబట్టి ఎలాంటి నటనా అనుభవం లేకున్నా... మఫ్టీలో వున్న పోలీసు పాత్రల్లో చక్కగా నటించారు. అలాగే లౌక్య, రాధిక పాత్రలు కూడా బాగా తీర్చి దిద్దారు. కిడ్నాప్ చేసే ముఠాలను కనిపెట్టడంలో వీరిదే కీలక పాత్రలు కావడంతో... రౌడీల చేతుల్లో పడినప్పుడు వారిని ఎదుర్కొనే తీరు చాలా ఎగ్జైటింగ్ గా వుంటుంది. వీరికి సహాయం చేసే పోలీసు కమిషనర్ పాత్ర కూడా పర్వాలేదు. అమ్మాయిలను కిడ్నాప్ చేయించి లైంగికంగా వేధించే వృద్దుని పాత్ర క్లైమాక్స్ లో మాత్రమే కనిపిస్తుంది. అయితే ఆ పాత్రను కేవలం ఒక్కసీనుకే పరిమితం చేయడంతో తేలిపోయింది.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రానికి దర్శకుడే నిర్మాత కూడా. అన్నీ తానై సినిమాను తెరకెక్కించాడు. అయితే వెల్ నోన్ క్యారెక్టర్లు లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. దాంతో పాటు ఎంచుకున్న కథకు అనుగుణంగా కథనం కూడా నడిపి వుంటే సినిమా బాగుండేది. ఎలాంటి ఎమోషన్స్ లేకుండా తీయడంతో కేవలం ‘రా’గానే మిగిలిపోయింది. నేపథ్య సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్ పర్వాలేదు. పూర్తిగా ఒకేరాత్రిలో జరిగే కథ కాబట్టి... దానికి సంబంధించిన మూడ్ ను సినిమాటోగ్రాఫర్ ప్రభాత్ బాగానే తెరపై చూపించాడు. తక్కువ నిడివి వుంటంతో ఎడిటింగ్ కూడా పర్వాలేదు.
చివరగా... 7 to 4.. ఇట్స్ ఎ హార్డ్ క్రైమ్ థ్రిల్లర్!
రేటింగ్: 2.25/5