Begin typing your search above and press return to search.
క్రైమ్ థ్రిల్లర్ '7 TO 4' ఏమిటంటే...?
By: Tupaki Desk | 29 March 2016 12:59 PM GMTఈ మధ్య వెరైటీ టైటిల్స్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. టైటిల్స్ విషయంలో తెలుగులో ఏమంత వెరైటీ చూపించరనేది మన చిత్ర పరిశ్రమ మీద వున్న పెద్ద అపవాదు. అదే తమిళంలోనైతే అంకెలతో కూడా సినిమా టైటిల్స్ ను నిర్ణయిస్తున్నారు. 7/జి బృందావనం... 3... 6(ఆరు)... 7సెన్స్... తాజాగా సూర్య, సమంత జంటగా నటిస్తున్న 24. ఇలా సంఖ్యల మీదే సినిమా పేర్లను నిర్ణయించి ఆడియన్స్ ను అలరించారు. ఇందులో ధనుష్, శ్రుతీహాసన్ జంటగా నటించిన 3 సినిమా ఒక్కటే డిజాష్టర్ అయింది. తమిళంలో ఇలా అంకెలతో టైటిల్స్ ను పెడుతుంటే... మన తెలుగు డైరెక్టర్ విజయ్ శేఖర్ సంక్రాంతి కూడా వారికేం తక్కువ కాదు అన్నట్టు.. తన తాజా చిత్రానికి '7 TO 4' అని నిర్ణయించారు. 'అబ్బాయిలు జాగ్రత్త-ఉచ్చులో పడకండి' అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ ఒకటో తేదీన రిలీజ్ కాబోతోంది. కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం ఈయనే విహిస్తున్నాడు. మినర్వాటాకీస్ పై ఈ చిత్రం రూపొందింది.
ఇందులో రాజ్-ఆనంద్-లౌఖ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జీవితంలో స్థిరపడటానికోసం ఉద్యోగం కోసం వెళ్లే అమ్మాయిలను వేధించే ఆకతాయిల పని ఎలా పట్టారనేదే ఈ చిత్రం కథాంశం. నలుగురు పోలీసు ఆఫీసర్లు కలిసి ఇలాంటి అల్లరి చిల్లరగా తిరిగే రౌడీ గ్యాంగ్ ను ఎలా పట్టుకుని పనిష్ చేశారనేదాన్ని ఓ సస్పెన్స్ క్రైమ్ డేస్డ్ తో తెరకెక్కించారు. ఈ సినిమా టైటిల్ ట్యాగ్ ను పరిశీలిస్తే... అబ్బాయిలు జాగ్రత్త.. ఉచ్చులో పడకండి అని రాసుంది. దీన్ని బట్టే అర్థం అవుతోంది... అబ్బాయిలు విమెన్ ట్రాఫికింగ్ లో పడి.. విగత జీవులుగా ఎలా మారుతున్నారనేది. సాయంత్రం 7 గంటల నుంచి తెల్ల వారు జామున 4 గంటల వరకు ఏమి జరిగింది... ఇందులో అబ్బాయిలను అమ్మాయిలు ఎందుకు చంపుతుంటారనేదాన్న సస్పెన్స్ బేస్ తో ఓ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించాం అన్నారు దర్శకుడు విజయ్ శేఖర్ సంక్రాంతి. ఇప్పటి వరకు మనం హారర్ బేస్డ్ సినిమాలే చూశాం. ఇప్పుడు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి 70 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. మరి చూడాలి... హారర్ సినిమాల్లాగే... ఈ సినిమా కూడా ఆడియన్స్ ను అలరిస్తుందేమో చూడాలి.