Begin typing your search above and press return to search.

RC15 కి ధ‌న ప్ర‌వాహం! ఒక్క‌ ట్రైన్ ఎపిసోడ్ కి 70 కోట్లు!

By:  Tupaki Desk   |   9 Nov 2021 5:32 AM GMT
RC15 కి ధ‌న ప్ర‌వాహం! ఒక్క‌ ట్రైన్ ఎపిసోడ్ కి 70 కోట్లు!
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్.సి15 అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ 15వ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇందులో చ‌ర‌ణ్ కి జోడీగా బాలీవుడ్ న‌టి కియారా అద్వాణీ న‌టిస్తోంది. అత్యంత‌ భారీ కాన్సాస్ పై పాన్ ఇండియా కేట‌గిరీలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప‌క్కా శంక‌ర్ మార్క్ విజువ‌ల్ రిచ్ సినిమా ఇది. ఓ ఐఏఎస్ అధికారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి వ్య‌వ‌స్థ‌ను క‌రెక్ట్ చేయాల‌నుకుంటే ఎలా ఉంటుంద‌న్న పాయింట్ ని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. శంక‌ర్ గ‌త చిత్రాలు `ఒకే ఒక్క‌డు`..`భార‌తీయుడు` రేంజ్ లో నేటి ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు మలుస్తున్నారట‌. ఎంచుకున్న టిఫిక‌ల్ థీమ్ తోనే సినిమా రేంజ్ ఏంటో ఊహించ‌వ‌చ్చు. శంక‌ర్ లో దాగిన సామాజిక స్పృహ‌ని మ‌రోసారి త‌న‌దైన శైలిలో కంటెంట్ గా వినియోగిస్తున్నారు.

ఇక సినిమాని అదే స్థాయిలో క‌మ‌ర్శియ‌లైజ్ చేయ‌డంలో శంక‌ర్ ప‌నిత‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు..ఖ‌రీదైన సెట్లు ఇలా చాలా హంగామానే శంక‌ర్ సినిమాలో సహ‌జంగా క‌నిపిస్తాయి. తాజాగా ఆర్ సీ 15 కోసం అంత‌కు మించి ఎగ్జైట్ మెంట్ తో శంక‌ర్ మూవ్ అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇందులో ఓ ట్రైన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 70 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారుట‌. 7 నిమిషాల పాటు ఈ యాక్ష‌న్ స‌న్నివేశం ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. కేవ‌లం 7 నిమిషాల యాక్ష‌న్ స‌న్నివేశం కోస‌మే 70 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారంటే సినిమా లో ఇంకా కీల‌క‌మైన స‌న్నివేశాల‌కు ఇంకెంత ఖ‌ర్చు చేయ‌నున్నారో..! సినిమా మొత్తానికి ఎంత ఖ‌ర్చు అవుతుందో కూడా అంచ‌నాలు వేస్తున్నారు.

నిర్మాత దిల్ రాజ్ కెరీర్ లోనే ఇదే అన్ లిమిటెడ్ బ‌డ్జెట్ చిత్రం అవుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ రాజు గారు ఒక సినిమా మొత్తానికి మ‌హా అయితే 70 కోట్ల లోపు ఖ‌ర్చు చేసి ఉంటారు. అలాంటింది ఇప్పుడు ఒక్క ట్రైన్ ఎపిసోడ్ కే 70 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారంటే.. ఆయ‌న‌ శంక‌ర్ ట్రీట్ మెంట్ కి ఏ రేంజ్ లో ఫిదా అయి ఉంటారో మ‌రోసారి అర్థ‌మ‌వుతోంది. ఇక సినిమా నిర్మాణం పూర్తయ్యే స‌రికి 200-300 కోట్లు ఈజీగా ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇటీవ‌లే మొద‌టి షెడ్యూల్ లో ట్రైన్ ఎపిసోడ్స్ ని చిత్రీక‌రిస్తున్న‌ప్ప‌టి ఆన్ లొకేష‌న్ స్టిల్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయిన సంగ‌తి విధిత‌మే. రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో స్టైలిష్ మాసివ్ విజువ‌ల్ వండ‌ర్ గా ఈ చిత్రం ఉంటుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌పోతే కోర్టు తీర్పు ద‌రిమిలా భార‌తీయుడు 2 పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను ముగించే వ‌ర‌కూ ఆర్.సి 15 వాయిదా ప‌డుతుంద‌ని క‌థ‌నాలొస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.

RC15 కి బ్రేక్ ప‌డితే చెర్రీకి ఆప్ష‌న్ ఉందా?

పాన్ ఇండియా చిత్రం RRR రిలీజ్ త‌ర్వాతా చ‌ర‌ణ్ వ‌రుస‌గా పాన్ ఇండియా ద‌ర్శ‌కుల‌కే గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశం గ‌ర్వించ ద‌గ్గ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో సినిమాకి క‌మిట‌య్యారు. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని ట్విస్టు. శంక‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎంతో ఆశ‌ప‌డ్డారు. తాజా కోర్టు తీర్పు నేప‌థ్యంలో ఇప్పుడు చ‌ర‌ణ్ ప్లాన్ త‌ల‌కిందుల‌య్యేట్లు క‌నిపిస్తోంది. `భార‌తీయుడు-2` కి కోర్టు క్లియ‌రెన్స్ ఇవ్వ‌డంతో డిసెంబ‌ర్ నుంచి ఆ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ చేయాల్సిన బాధ్య‌త శంక‌ర్ పై ఉంది. ఇంకా 100 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని తెలిసింది. మ‌రోవైపు ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోన్న కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫ్రెగ్నెన్సీ కార‌ణం ఆమె డేట్ల స‌మ‌స్య కూడా త‌లెత్త‌నుంది. మునుప‌టిలా సుల‌భంగా షూట్ లో పాల్గొనే స్కోప్ లేదు. ఆమె వెసులుబాటుని బ‌ట్టి షూట్ ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అటుపై పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు కొంచెం స‌మ‌యం ప‌డుతుంది. ఇలా ఏ కోణంలో చూసినా శంక‌ర్ ఇప్ప‌ట్లో ఫ్రీ అవ్వ‌డం క‌ష్ట‌మ‌ని తెలుస్తోంది. మొత్తానికి రామ్ చ‌ర‌ణ్ తో శంక‌ర్ తెర‌కెక్కించాల్సిన ఆర్.సి15 పెండింగ్ లో పడింది. ఈ నెల‌లోనే ఈసినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇంకా మేజ‌ర్ షెడ్యూల్ లోకి వెళ్ల‌లేదు. ఇంత‌లోనే `భార‌తీయుడు-2` డిసెంబ‌ర్లో మొద‌ల‌వ్వాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ సినిమా కి బ్రేక్ వేయ‌క‌ త‌ప్ప‌ద‌ని దాదాపు ఖ‌రారైపోయింది. మ‌రి ఇప్పుడు చ‌ర‌ణ్ ముందు ఉన్న‌ ప్లాన్ బీ ఏంటి? అంటే యంగ్ మేక‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరిని తో చ‌ర‌ణ్ 16వ చిత్రం సెట్స్ పైకి వెళుతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. `జెర్సీ` సినిమాతో స‌క్సెస్ అందుకున్న గౌత‌మ్ ఇప్పుడు బాలీవుడ్ లో అదే చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. దాదాపు ఆ సినిమా షూట్ కూడా పూర్త‌యింది. మ‌రి కొన్ని రోజుల్లో ఆయ‌న ఫ్రీ అయిపోతారు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ 16వ చిత్రాన్ని గౌత‌మ్ తో లాంచ్ చేసి ముందుకు వెళ్లిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్