Begin typing your search above and press return to search.

హిమాల‌యాల్లో 70ఏళ్ల వృద్ధుల సాహ‌సాలు

By:  Tupaki Desk   |   9 Nov 2022 6:30 AM GMT
హిమాల‌యాల్లో 70ఏళ్ల వృద్ధుల సాహ‌సాలు
X
బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ చేసిన‌న్ని ప్ర‌యోగాలు ఇంకెవ‌రూ చేసి ఉండ‌రేమో. ఓవైపు వ‌రుస‌గా క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంటూనే ఆయ‌న కెరీర్ ఆద్యంతం ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల‌తో మెప్పించారు. 70 ఏళ్ల వ‌య‌సులోను ఆయ‌న ఇంకా నిత్య‌య‌వ్వ‌నుడిగా ఎంతో ఉత్సాహంగా ప‌ని చేస్తూ యువ హీరోల‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

న‌టుడిగా హోస్ట్ గా బ్లాగ‌ర్ గా సామాజిక మాధ్య‌మాల రారాజుగా బిగ్ బి అంద‌రినీ అల‌రిస్తూనే ఉన్నారు. చేసే ప‌నికి వ‌య‌సు అడ్డంకి కాద‌ని నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఈ వ‌య‌సులో ఆయ‌న మైన‌స్ డిగ్రీల చ‌లిలో హిమాల‌యాల్లో భారీ ప్ర‌యోగం చేయ‌డం అభిమానుల‌కు షాకిస్తోంది.

ఇదంతా తాను న‌టిస్తున్న ఉంచై సినిమా కోసం సాహ‌సం. 70 ఏళ్ల వయసులో ఉన్న నలుగురు హీరోలతో తెరకెక్కిన చిత్రం ఉంచై. ఆ వయసులో హిమాలయ ప‌ర్వ‌తాల‌ను అధిరోహించాలనే వారి అత్యుత్సాహం గురించిన థ్రిల్ల‌ర్ ఇది. ఈ మూవీ టార్గెట్ ఏమిటో స్పష్టంగా అర్థ‌మ‌వుతోంది. రిలీజ్ ముందు ప్ర‌చారం ప‌రిశీలిస్తే.. థియేటర్లకు రాని సీనియర్ సిటిజనుల‌ను ఈసారి థియేట‌ర్ల‌కు ర‌ప్పించాల‌న్నది వారి ప్ర‌ణాళిక అని అర్థ‌మ‌వుతోంది. సినిమా OTTలు లేదా టీవీల్లోకి వచ్చే వరకు వారు(వృద్ధులు) వేచి చూడకుండా థియేట‌ర్ల‌కు ర‌ప్పించాల‌న్న‌ది ప్లాన్.

ఉంఛై 2022లో జ‌న‌రేష‌న్ కోసం చేయాల్సిన సినిమా కాదు. ఈ రోజుల్లో పరిస్థితి చాలా కఠినంగా ఉంది. ఎవరూ థియేటర్ కి వెళ్లడం లేదు.. అంటూ అమితాబ్ ఓకింత నిరాశ‌ను వ్య‌క్తం చేసినా త‌న సినిమా అంద‌రినీ మెప్పిస్తుంద‌ని ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. టీనేజ‌ర్లు యువ‌త‌రం ప్రేమ‌క‌థా చిత్రాల‌ను చూసేందుకు ఇష్ట‌ప‌డ‌డం స‌హ‌జం. కానీ అంద‌రిలోను స్ఫూర్తి నింపే చిత్ర‌మిద‌ని అమితాబ్ చెబుతున్నారు.

'ఉంచై' టిక్కెట్‌ల ధర కేవలం రూ.150 మాత్రమే అని ఈ సినిమాలో అమితాబ్ కోస్టార్ గా న‌టించిన నీనా గుప్తా తెలిపారు. ధ‌ర‌లు అందుబాటులో ఉన్నాయి... థియేట‌ర్ల‌లో సినిమా చూడండి అని కోరారు. నిజానికి సమస్య టికెట్ ధర కాదు.. కంటెంట్ ..ఎంపిక చేసుకున్న‌ టార్గెట్ ఆడియన్స్ అన్న‌ది గుర్తించాలి. 11 న‌వంబ‌ర్ 2022న ఉంఛై థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.