Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ కి క్షయ.. కాలేయం 75శాతం రిపేర్!
By: Tupaki Desk | 11 Jan 2023 12:31 PM GMT75 శాతం కాలేయం పాడైపోయింది.. అసలు తనకు క్షయ (టీబీ) అనే వ్యాధి ముదిరిందన్న విషయం తెలియడానికి ఎనిమిదేళ్లు పట్టిందని బిగ్ బి అమితాబ్ బచ్చన్ షాకిచ్చే విషయం తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే తనకు తెలియకుండానే అన్నేళ్లు గడిపేసానని బిగ్ బి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఎనిమిదేళ్ల పాటు రోగం ఏమిటన్నది తనకు తెలియకుండా గడిపేసానని ఆ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ విస్మయం చెందారు. అలాగే తాను క్షయవ్యాధితో బాధపడేవాడినని చెప్పుకోవడానికి తనకు అభ్యంతరం లేదని అన్నారు. దేశంలో 80శాతం పైగా ప్రజలు ముందస్తు నిర్ధారణ లేకుండానే అనారోగ్యాలను ముదరబెట్టుకుంటున్నానని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ముందస్తు రోగ నిర్ధారణ అనేది చికిత్సను సులభతరం చేయడానికి సహకరిస్తుంది. రెగ్యులర్ చెకప్ ల గురించి అవగాహన కల్పించాలని కోరారు.
``నేను ఎప్పటికప్పుడు నా వ్యక్తిగత ఉదాహరణను ఉటంకిస్తూనే ఉంటాను. మిమ్మల్ని మీరు కనీసం గుర్తించాలనే ఆలోచనను ప్రచారం చేస్తూనే ఉంటాను. నేను క్షయవ్యాధి నుండి బయటపడిన వ్యక్తిని. హెపటైటిస్ బి సర్వైవర్ అని బహిరంగంగా చెప్పటానికి నాకు అభ్యంతరం లేదు. నా కాలేయం పాడైపోయింది. 20 ఏళ్ల తర్వాత కూడా దాని పర్యవసానాల్ని గుర్తించగలిగాను. 75 శాతం కాలేయం పాడైంది. నేను ఇప్పటికీ 25 శాతమే జీవించి ఉన్నాను!`` అని బిగ్ బి చెప్పారు.
నా సమస్యను గుర్తించినప్పటికి మందు ఉంది. క్షయ వ్యాధికి పూర్తిగా వైద్యం అందుబాటులో ఉంది. దాదాపు 8 సంవత్సరాలుగా నాకు క్షయవ్యాధి ఉందని తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అమితాబ్ అన్నారు. ఎవరికైనా అలా జరిగితే అని తలుచుకుని నేను అందరికీ ఇది చెబుతూనే ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని మీరే పరీక్షించుకోవడానికి ఇష్టపడకపోతే అది తప్పిదం. అప్పుడు మీరు ఎప్పటికీ మీ ఒంట్లో రోగాల్ని కనుగొనలేరు. వాటికి చికిత్స ఎప్పటికీ ఉండదు అని అమితాబ్ చెప్పారు.
80 వయసులోను ఇప్పటికీ నిత్యం ఉల్లాసంగా గడుపుతున్న అమితాబ్ బచ్చన్ అజన్మాంతం నటిస్తూనే ఉంటానని అన్నారు. ఈ వయసులోను ఆయన బ్లాగులు రాస్తూ ఎంతో హుషారుగా ఉన్నారు. తన అభిమానులందరితోను ముచ్చటిస్తున్నారు. ఎప్పుడూ మేకప్ రూమ్ లో మేకప్ లతో గడిపేస్తూ సెట్లో అందరితో కలివిడిగా కలిసి మెలిసి పని చేస్తూనే ఉన్నారు. అతడు అలుపన్నదే ఎరుగని యోధుడిగా కనిపిస్తున్నా అతడికి ఉన్న అనారోగ్య సమస్య మాత్రం అలానే అతడిని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఒకసారి క్షయ వ్యాధి వచ్చాక అది తగ్గడానికి మందు ఉంది. కానీ ఆ మందుల వల్ల దుష్ప్రభావాలకు మాత్రం మందు లేదు. అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని చెబుతుంటారు.
RRR టీమ్ తాజా విజయంపై అమితాబ్
రాజమౌళి తెరకెక్కించిన RRR బుధవారం (జనవరి 11) లాస్ ఏంజిల్స్ లో మొదటి గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకుంది. ప్రతిష్టాత్మక అవార్డు షోలో ఈ టీమ్ తో పాటు భారత్ కూడా భారీ విజయానికి సంబరాలు చేసుకుంది. ఈ చిత్రం నుంచి `నాటు నాటు ..` పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కింది. స్వరకర్త ఎంఎం కీరవాణి అవార్డును అందుకున్నారు. గోల్డెన్ గ్లోబ్స్‌లో విజయం సాధించినందుకు షారుఖ్ ఖాన్ నుండి ప్రభాస్ వరకు పలువురు ప్రముఖులు ఆర్.ఆర్.ఆర్ టీమ్ ను అభినందించారు. తాజాగార్ అమితాబ్ బచ్చన్ ఈ విజయాన్ని కీర్తించారు. ఆర్.ఆర్.ఆర్ విజయంతో టీమ్ ని అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR టీమ్ పెద్ద విజయం సాధించినందుకు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఇన్ స్టాగ్రామ్ లో శుభాకాంక్షలు తెలిపారు.
RRR ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట అవార్డును గెలుచుకుంది. కానీ 1985లో అర్జెంటీనా ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం గా గెలుపొందడంతో ఆర్.ఆర్.ఆర్ అరుదైన అవకాశాన్ని కోల్పోయింది. ఇతర నామినీలు ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (జర్మనీ)- క్లోజ్ (బెల్జియం)- డెసిషన్ టు లీవ్ (దక్షిణ కొరియా) అవార్డులను కోల్పోయాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.