Begin typing your search above and press return to search.
సూపర్ సెన్షేషన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్
By: Tupaki Desk | 16 Jun 2022 4:30 PM GMTఈమద్య కాలంలో సోషల్ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో అత్యధికంగా ప్రచారం జరుగుతున్న సినిమాల్లో కన్నడ సినిమా '777 చార్లీ' ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. గుండెలను పిండేసేంతటి సెంటిమెంట్ తో ఈ సినిమా ఉందంటూ టాక్ బాగా వినిపిస్తుంది. కన్నడంలో ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా కూడా చర్చ జరుగుతోంది.
కేవలం కన్నడంలోనే కాకుండా ఇతర సౌత్ భాషల్లో కూడా ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేశారు. కాని ప్రమోషన్ సరిగా చేయక పోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లో పెద్దగా వసూళ్ల విషయంలో సత్తా చాటలేక పోయింది. కాని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు 777 చార్లీ ఓటీటీ లో వస్తుంది.. చూడాలి అంటూ ఎదురు చూస్తున్నారు.
ఓటీటీ లో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ అవుతుందని అంతా భావించారు. కాని యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను ఓటీటీ విడుదల చేసేందుకు చాలా సమయం ఉందట. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల్లో ఈసినిమా ను స్ట్రీమింగ్ చేయడం కాకుండా ఎనిమిది వారాల తర్వాత లేదా రెండు నెలల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకన్నట్లుగా తెలుస్తోంది. ఈ సూపర్ సెన్షేషన్ మూవీని వెంటనే ఓటీటీ లో చూడాలి అనుకుంటున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్. కాని ఈ సినిమా కు ఖచ్చితంగా ముందు ముందు భారీ వసూళ్లు నమోదు అవుతాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఈ సినిమాను చూసి కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెల్సిందే. ఆ సంఘటనతో సినిమా గురించి మరింతగా చర్చ మొదలు అయ్యింది. ఈ సినిమా లో రక్షిత్ శెట్టి నటించాడు. ఇతడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. కనుక తెలుగు లో కూడా ఈ సినిమాను విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ సినిమా 40 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా తెలుస్తోంది.