Begin typing your search above and press return to search.
భారతీయ సినిమాల్లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటి!
By: Tupaki Desk | 16 Jun 2022 2:30 AM GMTక్వీన్ కంగన రనౌత్ నటించిన భారీ యాక్షన్ చిత్రం `ధాకడ్` దేశవ్యాప్తంగా దారుణమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఎట్టకేలకు ధాకడ్ ఫుల్ రన్ ముగిసింది. లైఫ్ టైమ్ లో కనీసం 3కోట్లు అయినా వసూలు చేయలేకపోయింది. మొత్తానికి భారతీయ సినిమాల్లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
ధాకడ్ కోసం సుమారు రూ. 85 కోట్ల బడ్జెట్ ని నిర్మాతలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇందులో నిర్మాతలకు థియేట్రికల్ వెర్షన్ (ఇండియా) నుండి డిస్ట్రిబ్యూటర్ షేర్ గా 2 కోట్ల లోపు వచ్చింది. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో శాటిలైట్ - డిజిటల్ హక్కులను కూడా నిర్మాతలు విక్రయించలేదు. దీనివల్ల ధాకడ్ నష్టాలను తగ్గించడం కూడా అసాధ్యమని.. ఇది మేకర్స్ కి పీక మీద కత్తి లాంటి వ్యవహారమని బాలీవుడ్ క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.
కేవలం రిసీప్ట్ లలో కొంత ఆదాయాన్ని చూపడం కోసం శాటిలైట్ - డిజిటల్ హక్కులను స్క్రాప్ విలువకు విక్రయించాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా నిర్మాతలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. థియేట్రికల్ గా దారుణ వైఫల్యంతో ధాకడ్ కి శాటిలైట్ - డిజిటల్ ఆదాయం కలిపి రూ.5 కోట్ల కంటే తక్కువగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. కేవలం 2.58కోట్ల వసూళ్లతో ఇది ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది.
ధాకడ్ లెక్కలు పూర్తిగా పరిశీలిస్తే.. ప్రొడక్ట్ వ్యయం - 70 కోట్లు. ప్రింట్లు ప్రచార ఖర్చు (P&A) - 15 కోట్లు కాగా.. మొత్తం ఖర్చు - 85 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇండియా థియేట్రికల్ బాక్స్ ఆఫీస్ - 2.58 కోట్లుగా ఉంది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ (A) - 1.16 కోట్లు మాత్రమే. ఓవర్సీస్ థియేట్రికల్ బాక్స్ ఆఫీస్ - 0.70 కోట్లు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ షేర్ (B) - 0.32 కోట్లు. శాటిలైట్- డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ & మ్యూజిక్ రైట్స్ (సి) - 5 కోట్లు మించదని విశ్లేషకులు అంచనా వెలువరించారు. మొత్తానికి ఇది ఊహించనంత ఘోరమైన ఫలితం. క్వీన్ కంగన ఇమేజ్ కి మార్కెట్ కి డ్యామేజ్ కలిగించే దారుణ వైఫల్యం అంటూ విశ్లేషిస్తున్నారు. ఇది పూర్తిగా జాతీయ మీడియాల్లో వచ్చిన కథనాల నుంచి సంగ్రహించిన కథనం.
ఊహించని వరుస పరాభవాలు
కంగనా రనౌత్ `ధాకడ్` కేవలం పరాజయం మాత్రమే కాదు.. అవమానకరమైన డిజాస్టర్ అని ట్రేడ్ విశ్లేషించింది. ఈ ఫలితం మొత్తం పరిశ్రమను షాక్ కు గురి చేసింది. చాలా చోట్ల సినిమాని తొలి మూడు రోజుల్లోనే థియేటర్ల నుండి తొలగించారు. ఇంతటి దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవడంతో శత్రువులకు ఒక్కసారిగా ఊపిరిలూదినట్టయ్యింది. ఇప్పుడు ఒక సెక్షన్ మీడియాని అడ్డు పెట్టుకుని కంగనపై వరస కథనాలు వేడెక్కిస్తున్నాయి. నిజానికి పరాజయాల్లో ఉన్నవారిని.. సోషల్ మీడియా ఎలా ట్రోల్స్ చేస్తుందో తెలిసిందే. తీవ్రమైన దూషణల ఫర్వం ఇటీవల ఈ వేదికలపై బయటపడుతోంది. అయితే కంగన చాలా విషయాల్లో పాజిటివ్ గానే ఉంది. తన చుట్టూ ముసురకున్న నెగిటివిటీపై కంగనా స్పందిస్తూ ``2019లో మణికర్ణిక లాంటి సూపర్ హిట్ ఇచ్చాను...2021 తలైవి OTTలో వచ్చి భారీ విజయాన్ని సాధించింది`` అంటూ డ్యామేజ్ కంట్రోల్ కి ప్రయత్నిస్తోంది. నేను చాలా ప్రతికూలతను చూస్తున్నాను కానీ 2020 బ్లాక్ బస్టర్ `లాక్ అప్` హోస్టింగ్ బిగ్ హిట్.. అంటూ తనని తాను జూమ్ చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే తిరిగి తన కెరీర్ బండిని సరైన ట్రాక్ లోకి ఎక్కించి అదిరిపోయే బ్లాక్ బస్టర్ తో శత్రువులకు మైండ్ బ్లాక్ అయ్యే సమాధానమిచ్చే ఆలోచన తనలో ఉందని కంగన చెబుతోంది.
కోలుకోలేని పంచ్ పడినా కానీ..!
నిజానికి కంగన నటించిన తలైవి థియేటర్లతో పాటు ఓటీటీలో వచ్చినా కానీ ఫ్లాప్ షోగా నిలిచింది. జె. ఈ జయలలిత బయోపిక్ థియేటర్లలో సరైన ఫలితం అందుకోలేదు. మొదటి వారాంతంలో కేవలం రూ.1.09 కోట్లు రాబట్టింది. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం రూ.4.75 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమా విడుదలైనప్పుడు థియేటర్లలో 50 శాతం సీట్లు బుక్ చేసుకోవాలనే నిబంధన అమల్లో ఉంది. అయినప్పటికీ ఈ రెవెన్యూ చాలా దారుణంగా కనిపించింది. 2019లో విడుదలైన కంగనా `మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` మొదటి వారాంతంలో రూ. 39.51 కోట్లు రాబట్టింది. ఈ సినిమా జీవితకాల వసూళ్లు రూ. 90.81 కోట్లు. ఈ సినిమా బడ్జెట్ 99 కోట్లు అని చెప్పడంతో కంగనాకు కూడా ఈ సినిమా కొంతమేర నష్టాన్ని మిగిల్చింది. దీని తర్వాత ‘జడ్జిమెంటల్ హై క్యా’ తొలి వారాంతంలో రూ.19.19 కోట్లు రాబట్టింది. లైఫ్ టైమ్ ఆదాయం రూ.33.95 కోట్లుగా ఉంది. `పంగా`కు జీవితకాల వసూళ్లు రూ.22.36 కోట్లు కాగా.. మొదటి వారాంతంలో రూ.10.28 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ధాకడ్ లైఫ్ టైమ్ లో కోటిన్నర షేర్ తో దారుణంగా విఫలమైంది. 100 కోట్ల క్లబ్ సినిమాల్లో నటించిన కంగనకు ఇది ఊహించని పరాభవం.