Begin typing your search above and press return to search.
ఎన్టీవోడి నెక్ట్స్ టార్గెట్ ఎనభయ్యే!!
By: Tupaki Desk | 5 July 2016 11:48 AM GMTజూనియర్ ఎన్టీఆర్ స్టామినాని ఇప్పటివరకూ టాలీవుడ్ పూర్తిగా చూడలేదనే కామెంట్స్ తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటి స్టార్ హీరోల్లో అందరికంటే ముందే స్టార్ స్టేటస్ అందుకున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. కానీ కొన్నేళ్లుగా జూనియర్ బాగా వెనకబడిపోయాడు. ఇందులో చేతులారా చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయనే మాటను అంగీకరించాల్సిందే. అయితే వాటిన్నిటినీ సరి చేసుకుంటూ వస్తున్న ఎన్టీఆర్.. ఇప్పుడు వరుస హిట్స్ కొడుతున్నాడు. పూరీతో టెంపర్.. సుకుమార్ తో నాన్నకు ప్రేమతో చిత్రాలను సూపర్ హిట్స్ గా నిలిపిన ఎన్టీఆర్.. ఇప్పుడు పెద్ద టార్గెట్ నే సెట్ చేసుకున్నాడు.
నాన్నకు ప్రేమతో మూవీతో మొదటిసారిగా 50 కోట్ల మార్కును అందుకున్న జూనియర్.. కొరటాలతో కలిసి తీస్తున్న జనతా గ్యారేజ్ తో ఆ రేంజ్ ని మరింతగా పెంచుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే బిజినెస్ లు కూడా గట్టిగానే జరుగుతున్నాయి. ఇందులో కొరటాల ఫ్యాక్టర్ కూడా ఉన్నా.. ఎన్టీఆర్ స్టామినాని అండర్ ఎస్టిమేట్ వేయడానికి లేదు. జనతా గ్యారేజ్ విషయంలో.. సినిమా స్టార్టింగ్ నుంచి అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకుంటున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేయడంలో కూడా చొరవ చూపిస్తున్నాడు.
ఆగస్ట్ 12న జనతా గ్యారేజ్ విడుదల ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. ఈ మూవీకి కనీసం 70 కోట్ల మేరకు బిజినెస్ జరుగుతోంది. కలెక్షన్స్ విషయంలో కూడా ఇండస్ట్రీ టాప్ 5 లోకి చేరడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నాడు జూనియర్. కనీసం 70 కోట్ల వసూళ్లు సాధించాలనే లక్ష్యం పైకి కనిపిస్తున్నా.. ఎన్టీఆర్ అసలు టార్గెట్ మాత్రం 80 కోట్ల షేర్ వసూళ్లే అనే టాక్ వినిపిస్తోంది. ఆ మార్క్ ని అందుకుంటే మాత్రం.. హ్యాట్రిక్ సాధించడమే కాదు.. ఎన్టీఆర్ చరిత్ర కూడా సష్టించేస్తాడు.
ఇకపోతే రేపు (జూలై 6) సాయంత్రం.. 6 గంటలకు.. జనతా గ్యారేజ్ తొలి టీజర్ ను ఎన్టీఆర్ తన ట్విట్టర్ పేజీ ద్వారా విడుదల చేయనున్నాడు.