Begin typing your search above and press return to search.

80 ఏళ్ల వయసులో లవర్‌ అండ్‌ దాదాగా..!

By:  Tupaki Desk   |   11 Feb 2019 9:22 AM GMT
80 ఏళ్ల వయసులో లవర్‌ అండ్‌ దాదాగా..!
X
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సోదరుడు చారుహాసన్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో చిత్రాల్లో నటించి, విలక్షణ నటుడిగా మెప్పించాడు. అద్బుతమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు. కమల్‌ హాసన్‌ స్థాయిలో కాకున్నా చారుహాసన్‌ కూడా నటుడిగా విలక్షణమైన తన శైలిని కనబర్చుతూ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్నాడు. 80 ఏళ్ల వయసులో కూడా చారుహాసన్‌ ఇంకా నటించేందుకు ఆసక్తి చూపుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ముఖ్య పాత్రల్లో మాత్రమే నటిస్తూ వచ్చిన చారుహాసన్‌ 80 ఏళ్ల వయసులో హీరోగా నటించబోతున్నాడు.

'దాదా 87' అనే చిత్రం చారు హాసన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో చారుహాసన్‌ గ్యాంగ్‌ స్టర్‌ గా కనిపించబోతున్నాడు. ఒక ముసలి డాన్‌ పాత్రలో చారుహాసన్‌ మెప్పించబోతున్నాడు. ఈ చిత్రంలో ఆయన యాక్షన్‌ సీన్స్‌ కూడా చేయబోతున్నాడు. ఇక 'దాదా 87'లో కేవలం యాక్షన్‌ మాత్రమే కాకుండా రొమాన్స్‌ కూడా ఉండబోతుందట. మరీ రొమాన్స్‌ కాకుండా ముసలి వయసులో తన భాగస్వామితో ప్రేమను చూపుతాడన్నమాట. చారుహాసన్‌ కు జోడీగా సరోజ నటించనున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతున్న కీర్తి సురేష్‌ బామ్మ ఈ సరోజ గారు.

మనవరాలు హీరోయిన్‌ గా దూసుకు పోతున్న సమయంలో సరోజ కీలక పాత్రలో నటించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఒకప్పటి హీరోయిన్‌ అయిన సరోజ గారు చాలా కాలం తర్వాత మళ్లీ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. చారుహాసన్‌, సరోజల కాంబో మూవీ కోసం తమిళ సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.