Begin typing your search above and press return to search.
వరల్డ్ కప్ నేపథ్యం.. నాగార్జున నిర్మాత!
By: Tupaki Desk | 19 Dec 2021 8:17 AM GMTబాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించిన `83` చిత్రం రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. తొలిసారి భారత్ వరల్డ్ కప్ ని టీమిండియా రధసారథి కపిల్ దేవ్ ముద్దాడిన క్షణాల్ని వెండి తెరపై చూసుకుని మురిసిపోవాలని క్రీడాభిమానులంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇంగ్లాండ్ వేదికగా వెస్టీండీస్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ నుంచి ఎంత మంది ప్లేయర్లు ఎంపికయ్యారు. తుది ఎంపికలో ఎంత మంది మైదానంలోకి వెళ్లారు? మ్యాచ్ ప్రారంభానికి ముందు చోటు చేసుకున్న సన్నివేశాలు? 60 ఓవర్ల మ్యాచ్ లో భారత్ 183 పరుగుల స్వల్ప లక్ష్యానికే పరిమితమవ్వడం? అటుపై చేధనకు దిగిన కరేబియన్లు 140 పరుగులకే ఆలౌట్ కావడం? 43 పరుగుల తేడాతో తొలిసారి వరల్డ్ కప్ ని ముద్దాడిన క్షణాల్ని..ఏమోషన్ ఎంతో అద్భుతంగా చూపించడానికి కబీర్ ఖాన్ రెడీ అయ్యారు.
ఇంకా 83 వరల్డ్ కప్ లో ఎంతో ఎమోషన్ దాగి ఉంది. ఆ క్షణాలన్నింటిని మరోసారి కబీర్ ఖాన్ గుర్తు చేయబోతున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా రాకతో ఏడాదిన్నరగా వాయిదా పడుతుంది. చివరిగా ఈనెల 24న రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. హిందీ- తమిళం- తెలుగు- కన్నడ- మలయాళం భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇక చిత్రాన్ని తెలుగులో కింగ్ నాగార్జున సమర్పిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇన్ స్టా వేదికగా ఓ వీడియో రూపంలో పంచుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు నాగార్జున తెలిపారు.
1983 క్రీడాభిమానుల ఎమోషన్ ని వెండి తెరపై చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో కనిపిస్తుండగా దీపికా పదుకొణే కపిల్ భార్య రోమి పాత్రలో నటిస్తుంది. ఇంకా పంకజ్ త్రిపాఠి.. బొమన్ ఇరానీ.. సకీబ్ సలీమ్.. హార్డీ సంధు.. తాహిర్ రాజ్ భాసిన్.. జతిన్ సర్నా అమీ విర్క్‌తో సహా పలువురు నటులు ఇతర క్రికెటర్ల పాత్రల్లో నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్..ఫాంటమ్ ఫిల్మ్స్..వైబ్రీ మీడియా..కబీర్ ఖాన్ ఫిల్మ్స్..నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ లో ఆలియాతో కలిసి బ్రహ్మాస్త్ర చిత్రంలో నాగార్జున నటించిన సంగతి తెలిసిందే.