Begin typing your search above and press return to search.
`పుష్ప` దెబ్బకు 83 అలా పోయిందా?
By: Tupaki Desk | 6 Jan 2022 4:41 AM GMTపుష్ప- ది రైజ్ అంచనాల్ని మించి హిందీ బెల్ట్ లో సక్సెసైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే హిందీ బాక్సాఫీస్ వద్ద 50కోట్ల క్లబ్ లో అడుగుపెట్టి ఇప్పటికీ ఘనమైన వసూళ్లను సాధిస్తోంది. 50 కోట్ల నుంచి 100కోట్ల క్లబ్ లో అడుగుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ తర్వాత మళ్లీ పుష్ప బాలీవుడ్ లో సత్తా చాటింది. కోవిడ్ - ఓమిక్రాన్ క్రైసిస్ ప్రభావం లేకపోతే రిజల్ట్ వేరొకలా ఉండేదన్న అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ఎంతో క్రేజుతో రిలీజైన 83 రిజల్ట్ తుస్సుమంది. ఈ సినిమా షారూక్ జీరో కంటే డిజాస్టర్ అన్న చర్చా వేడెక్కిస్తోంది. రణ్‌వీర్ సింగ్ లాంటి ఎనర్జిటిక్ హీరో నటించిన బయోపిక్ చిత్రం 83 ..అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాలలో ఒకటి. భారతీయ క్రికెట్ లో అత్యంత అద్భుతమైన అధ్యాయాన్ని పునఃసృష్టిస్తూ - 1983 ప్రపంచ కప్ విజయంపై తెరకెక్కిన మూవీ ఇది. 83 24 డిసెంబర్ 2021న థియేటర్లలోకి వచ్చింది. సెలబ్రిటీల నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రివ్యూలు రావడంతో ఉత్కంఠ పెరిగింది.
విమర్శకులు క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ గా రణవీర్ నటనను ప్రశంసించారు. అయితే ఇవేవీ బాక్సాఫీస్ నంబర్లలో వర్కవుట్ కాలేదు. కానీ అంతిమంగా ఫలితం రివర్సయ్యింది. షారుఖ్ ఖాన్ 2018 డిజాస్టర్ జీరో కంటే ఈ చిత్రం పెద్ద రేంజులో పరాజయం పొందింది. కోవిడ్-ఉందని ఆలోచించినా కానీ 83 బాక్సాఫీస్ నంబర్లు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. స్పోర్ట్స్ డ్రామాలో ఏం తప్పు జరిగిందో ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గత సంవత్సరం విడుదలైన రోహిత్ శెట్టి సూర్యవంశీతో దీపావళి ధమాకాను అందించాడు. అజయ్ దేవగన్ - రణ్‌వీర్ సింగ్ అతిధి పాత్రలు పోషించిన ఈ చిత్రం మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 174.65 కోట్లను రాబట్టింది. మరోవైపు రణవీర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 83 దాని మొదటి వారం తర్వాత రూ. 100 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించగలిగింది, ప్రపంచవ్యాప్తంగా రూ. 106 కోట్లతో బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శనను కనబరిచింది. దీనికి ఒక కారణం ఏమిటంటే,యువ ప్రేక్షకులు సినిమాను చూడటానికి థియేటర్ లకు వెళ్లేంత ఉత్సాహాన్ని అందించలేకపోయిందన్న టాక్ వినిపించింది.
1983 ప్రపంచ కప్ ఆనందాన్ని యూత్ ఎందుకని రిసీవ్ చేసుకోలేదు? అన్నదానిపైనా విశ్లేషణలు సాగుతున్నాయి. చాలా సినిమాల్లో 83 స్టాండింగ్ ఒవేషన్ పొందుతోంది.. కానీ ఇది డైకోటమీ లాంటిది. ఒక వర్గం దానిని ప్రేమిస్తున్నప్పుడు మరొక విభాగానికి నచ్చలేదు. ఆ విభాగం ఒక చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందా అని నిర్ణయించే విభాగం. అది మాస్ కావచ్చు.. యూత్ కావచ్చు. మొత్తం ప్రేక్షకులు - 15 నుండి 35 ఏళ్ల మధ్య ఏజ్ ఉన్నవారు సినిమా చూడలేదు. ఇంత భారీ బడ్జెట్ తో సినిమా తీస్తే ఆ వర్గాల్ని విస్మరించలేరు. కా యువతరం గతాన్ని నమ్మడం లేదు. వారికి చారిత్రక వాస్తవాలపై ఆసక్తి లేదు.
వారి క్రికెట్ హీరోలు ఎంఎస్ ధోని .. విరాట్ కోహ్లీ మాత్రమే. వారు కపిల్ దేవ్ అతని టీమ్ ని గుర్తించలేదు.. 83 లో యూత్ ఇప్పుడు ఎంతమంది చూస్తారు? ఇవన్నీ సమస్యలేనని విశ్లేషించారు. 83 పాత్రల గురించి వ్యక్తిగతీకరించిన భావోద్వేగ కథాంశాన్ని కలిగి ఉంటే.. అది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ `MS ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ` చేయగలిగినట్లుగా యువతను ఆకర్షించడంలో విజయవంతమై ఉండేది... అని విశ్లేషించారు.
డాక్యు-డ్రామా నేచర్ ఆఫ్ 83 సినిమా వసూళ్లను అడ్డుకుందని అన్నారు.
ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ 83 హిట్ అయ్యేలా ఉందని భావించినా అంచనా తారుమారైంది. 83 చాలా బాగా తెరకెక్కిందనేది తిరస్కరించడం లేదు. దీన్ని చూసిన వ్యక్తుల నుండి ప్రశంసలు దక్కాయి. కానీ దురదృష్టవశాత్తు ఇది మెట్రోలను దాటి ఇతర సెంటర్లలో విజయంగా మారలేదు. మల్టీప్లెక్స్‌ల కంటే కలెక్షన్లు చాలా తక్కువ. .. సినిమాకు తక్కువ ఆదరణ ఉంది అని తరణ్ అన్నారు. 83 డాక్యుమెంట్ డ్రామాలా అనిపిస్తోందని ఇది కమర్షియల్ మసాలా చిత్రాలను కోరుకునే వారికి నచ్చదని ఆయన సూచించారు.
అయితే తరణ్ ఆదర్శ్ 83ని భవిష్యత్తులో గుర్తుంచుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐటెమ్ సాంగ్ లేదా కమర్షియల్ అంశాలు ఉండకూడని కథాంశమిదని ఆయన తెలిపారు. కానీ కొన్ని చిత్రాలు అద్భుతమైనవిగా చరిత్రలో నిలిచిపోతాయి. అవి విడుదలైనప్పుడు పని చేయకపోవచ్చు. అలాంటి సినిమాల్లో 83 కూడా ఒకటి అవుతుందని భావిస్తున్నాను.. అని అన్నారు.
మరోవైపు పుష్ప - స్పైడర్‌మ్యాన్ ల నుండి పోటీ కూడా 83కి ప్రమాదకరంగానే మారిందన్న విశ్లేషణ ఒక సెక్షన్ లో సాగుతోంది. ఓమిక్రాన్ వేరియంట్ ఆందోళనకు ప్రధాన కారణం అయినప్పటికీ 83 దుర్భరమైన బాక్స్ ఆఫీస్ నంబర్ లకు నిరాశ తప్పలేదు. అన్నింటికంటే ప్రజలు సినిమాలకు వెళ్తున్నారనడానికి డిసెంబర్ 17న థియేటర్లలోకి వచ్చిన అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల మార్కును అధిగమించడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నాయి బాలీవుడ్ మీడియా వర్గాలు.
నిజానికి పుష్ప డ్రీమ్ రన్ సౌత్ లోనే కాదు ఇండియా అంతటా కొనసాగుతోంది. మరోవైపు టామ్ హాలండ్ `స్పైడర్ మ్యాన్: నో వే హోమ్` చాలా కాలంగా పెద్దగా వ్యాపారాన్ని చూడని థియేటర్ లకు ప్రాణం పోసిందని విశ్లేషిస్తున్నాయి.
83 క్రిస్మస్ న్యూ ఇయర్ వారాంతాల్లో జెర్సీ (షాహిద్) వాయిదా వల్ల ప్రయోజనాన్ని పొందింది. 83కి చాలా పెద్ద పోటీదారులుగా నిలిచిన వాటలో పుష్ప ఉంది. పుష్ప -స్పైడర్ మాన్ లకు వర్కవుటైంది. ఇప్పటి వరకు పుష్ప బలంగా ఉంది.. ఇది భారీగా వర్కవుటవుతోందని తరణ్ విశ్లేషించారు.