Begin typing your search above and press return to search.
2022 బెస్ట్ జోక్.. #83 ప్లాప్ కి వైరస్ కారణమా?
By: Tupaki Desk | 10 Jan 2022 10:30 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటించిన `83` డిసెంబర్ 24న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 1983లో ఇండియా తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన క్రీడానేపథ్యంతో టీమిండియా కెప్టెన్ కపిల్ ప్రతిభను హైలైట్ చేస్తూ తీసిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని కబీర్ ఖాన్ తెరకెక్కించారు. క్రికెట్ నేపథ్యం కాట్టి సినిమాపై అంచనాలు సహజంగానే ఏర్పడతాయి. అయితే ఈ సినిమా ని పెద్దగా ప్రమోట్ చేయలేదు. దీంతో బజ్ కూడా ఆశించిన విధంగా క్రియేట్ అవ్వలేదు. మరి పాండమిక్ కారణంగా లైట్ తీసుకున్నారా? కంటెంట్ పై నమ్మకం కోల్పోయి లైట్ తీసుకున్నారా? అన్నది తెలియదుగానీ... 24న రిలీజ్ అయిన `83` మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా తేలింది. ఈ సినిమాకి ఆశించినంతగా యువతరం ఆదరణ దక్కలేదని కరణ్ జోహార్ విశ్లేషించారు. ఎం.ఎస్.ధోని బయోపిక్ ట్రెండ్ కపిల్ దేవ్ బయోపిక్ అందుకోలేదని అన్నారు.
కనీసం క్రికెట్ ప్రేమికుల్ని కూడా చిత్రం ఆకట్టుకోలేదు. ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రాలేదు. తాజాగా సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ చూస్తే బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రాలగా నిలిచిన `వెల్వెట్`..`ద్రోణ` చిత్రాల సరసన `83` చేరినట్లు బాలీవుడ్ మీడియా కథనాలు వేడెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ క్రికెట్ నేపథ్యం ఉన్న ఏ సినిమా కూడా ఇలాంటి ఘోరమైన ఫలితాన్ని అందుకోలేదని విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే ఈ పరాజయాన్ని చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ కరోనా వైరస్ మీదకు తోసేసారు. పాండమిక్ కారణంగా తమ సినిమా సరిగ్గా ఆడలేదని..కంటెంట్ లోపం కాదని సమర్ధించుకుంటున్నారు.
నిజంగా పాండమిక్ రీజన్ అయితే అదే సమయంలో రిలీజ్ అయిన `పుష్ప`..`స్పైడర్ మ్యాన్`..`సూర్యవంశీ లాంటి చిత్రాలు ఎందుకు సక్సెస్ అవుతాయని విమర్శకులు..నెటిజనులు విమర్శలు ఎక్కుపెట్టారు. తెలుగు సినిమా `పుష్ప`నే ఉత్తరాదిన మంచి వూళ్లను సాధించింది. తొలి రెండు రోజులు జనాలు థియేటర్ కి వెళ్లకపోయినా `పుష్ప`పై పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో జనాలు ఒక్కసారిగా తరలడం మొదలు పెట్టారు. ఆరకంగా `పుష్ప` అక్కడా పెద్ద సక్సెస్ అయింది. మరి `83` ఎందుకు సక్సెస్ కాలేదు అన్నదానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లే. ఎంత ఘోరం ! పరాజయాన్ని కరోనా వైరస్ మీదకి తోసేస్తారా? అంటూ పలువురు ఘాటుగానే చిత్రబృందాన్ని విమర్శిస్తున్నారు. 83 పరాజయం రణవీర్ - దీపికతో పాటు కబీర్ ఖాన్ కి కూడా గొప్ప గుణపాఠం. కంటెంట్ బావుండి ఫ్లాపైన చిత్రంగా 83 రికార్డులకెక్కింది.