Begin typing your search above and press return to search.
పరిస్థితి బాగాలేదు.. మా సినిమా ఓటీటీ లో రిలీజ్ చేస్తాం
By: Tupaki Desk | 3 Jan 2022 4:30 PM GMT1983 లో భారత క్రికెట్ జట్టు సాధించిన అద్బుత విజయాన్ని కళ్ల ముందు నిలిపేందుకు తీసుకు వచ్చిన చిత్రం '83'. రణవీర్ సింగ్ మరియు దీపిక పదుకునే జంటగా రూపొందిన ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. సినిమా కరోనా కారణంగా రెండేళ్లుగా అదుగో ఇదుగో అన్నట్లుగా వాయిదాలు పడుతూ వచ్చింది. సినిమా కు వందల కోట్ల డీల్ తో ఓటీటీ ఆఫర్ వచ్చినా కూడా మేకర్స్ థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తామంటూ విడుదల వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయడం జరిగింది. సినిమా విడుదల అయిన వెంటనే ఒమిక్రాన్ కేసులు పెరగడం మొదలు అయ్యింది. దాంతో ఉత్తర భారతంలో ముఖ్యంగా ఢిల్లీ మరియు బెంగాళ్ లో థియేటర్లు మూసి వేశారు. మహా రాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీ అలా మొత్తం ఉత్తర భారతంలో బాలీవుడ్ సినిమాల మార్కెట్ ఉన్న అన్ని చోట్ల కూడా ఆంక్షలు అమలు కావడంతో 83 వసూళ్లు దారుణంగా ఉన్నాయి.
సినిమా ట్రైలర్ విడుదల సమయంలో ఆహా ఓహో అన్నట్లుగా కామెంట్స్ చేసిన వారే సినిమాను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు అన్నట్లుగా టాక్ వస్తుంది. సినిమా ట్రైలర్ లో అద్బుతమైన క్రికెట్ ను సినిమా లో చూడబోతున్నట్లుగా చూపించారు. కనుక సినిమా ప్రతి ఒక్క ఇండియన్ క్రీడాభిమానికి.. సినీ అభిమానికి కనెక్ట్ అవుతుందని ఆశించారు. సినిమా ను ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. కాని సినిమా ఇన్ని రోజులు అయినా కనీసం వంద కోట్ల వసూళ్లను దక్కించుకోలేక పోయింది. ఒకానొక సమయంలో 83 సినిమా వసూళ్ల కంటే అల్లు అర్జున్ పుష్ప హిందీ వర్షన్ వసూళ్లు ఎక్కువ ఉంటాయేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు వంద కోట్లకు కాస్త అటు ఇటుగా 83 చేరింది. అయితే మేకర్స్ ఆశించిన వసూళ్లలో ఈ మొత్తం కనీసం సగం కూడా కాదంటూ కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా దర్శకుడు కబీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి.
ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా విడుదల అయిన తర్వాత థియేటర్ల వద్ద పరిస్థితి బాగాలేదు. మా సినిమా విడుదల అయిన వెంటనే ఢిల్లీలో ఆంక్షలు.. బెంగాళ్ లో కూడా ఆంక్షలు విధించారు. దాంతో సినిమా కు వసూళ్లు చాలా తక్కువ వచ్చాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలోనే 83 సినిమాను ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేస్తామంటూ ప్రకటించాడు. అయిదు లేదా ఆరు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు గాను ఓటీటీ సంస్థతో ఇప్పటికే మేకర్స్ ఒప్పందం చేరుకున్నారట. కాని థియేటర్ల వద్ద పరిస్థితులు బాగాలేని కారణంగా రెండు మూడు వారాల ముందుగానే ఓటీటీ లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అనుకుంటున్నారు. ఇదే సమయంలో దర్శకుడు కబీర్ ఖాన్ కూడా అదే మాట మాట్లాడాడు. దాంతో ఒకటి రెండు రోజుల్లోనే 83 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన తేదీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రకటన లేకుండా డైరెక్ట్ గా ఓటీటీ లో దూకినా ఆశ్చర్యం లేదు. ఓటీటీ లో ఖచ్చితం 83 సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.