Begin typing your search above and press return to search.
83 వివాదం పై విబ్రి మీడియా వివరణ
By: Tupaki Desk | 14 Dec 2021 8:30 AM GMTరణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన 83 త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పలువురు భాగస్వాములు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ బయోపిక్ చిత్రాన్ని నిర్మించారు. అయితే గల్ఫ్ కి చెందిన ఒక పెట్టుబడి దారు తన 16కోట్ల పెట్టుబడుల గురించి.. నిర్మాతలపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనమైంది.
నిర్మాతలు తనను మోసం చేశారంటూ సదరు వ్యక్తి కోర్టుకెక్కారు. అయితే దానికి నిర్మాతలు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించారు. రణవీర్ .. విబ్రి మీడియా సహా దీపికా పదుకొణె కో-ప్రొడ్యూసర్ కూడా కావడంతో ఆమె పేరు కూడా వివాదంలోకి వచ్చింది.
తాజాగా విబ్రి మీడియా విష్ణు ఇందూరి ప్రతినిధి ఫ్యూచర్ రిసోర్సెస్ ఎఫ్.జె డ్.ఈ కేసును తప్పుడు నిరాధారమైన ప్రేరేపించబడిన ఆరోపణలు అని కొట్టి పారేశారు. ఫిర్యాదుదారు వాదనలను కూడా ఖండించారు. 83 మేకర్స్ ఈ కేసుతో ఏ విధంగానూ ఆందోళన చెందలేదు అని అన్నారు. ఫ్యూచర్ రిసోర్సెస్ FZE విబ్రి మీడియాలో మైనారిటీ వాటాదారు. విబ్రి మీడియా ప్రమోటర్లు .. ఫిర్యాదుదారు మధ్య అంతర్గత వివాదాలు ఉన్నాయి. అవి వివిధ కోర్టులలో పెండింగ్ లో ఉన్నాయి. ఫిర్యాదుదారు ఫ్యూచర్ రిసోర్సెస్ ఎఫ్.జెడ్.ఇని గౌరవ తెలంగాణ హైకోర్టు 83 చిత్రం విషయమై ఏ విధంగానూ జోక్యం చేసుకోకుండా నిరోధించింది`` అని వారు తెలిపారు. దీనిని ‘పబ్లిసిటీ జిమ్మిక్కు’గా పేర్కొంటూ.. కోర్టు ధిక్కారమని విబ్రి మీడియా పేర్కొంది. దీని కోసం ఫిర్యాదుదారుపై విబ్రి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తన చట్టపరమైన పరిష్కారాలను కోరుతోంది. 83 - నిర్మాతలు దీని గురించి ఏ విధంగానూ ఆందోళన చెందలేదు. ఫ్యూచర్ రిసోర్సెస్ FZEకి వ్యతిరేకంగా తగిన చర్య తీసుకునే హక్కు వారికి ఉంది అని విబ్రి మీడియా ప్రతినిధి తెలిపారు.
UAEకి చెందిన ఒక ఫైనాన్షియర్ కంపెనీ 83లో దాదాపు రూ. 16 కోట్ల పెట్టుబడి పెట్టింది. దానికి ప్రతిగా విబ్రి మీడియా మంచి రాబడిని అందజేస్తుందని వాగ్దానం చేసిందని ఆరోపించాడు. ప్రతిఫలంగా వాగ్దానం చేసిన వాటిని పొందకపోవడంతో సదరు గల్ఫ్ వ్యాపారవేత్త అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ముంబైలో 83 నిర్మాతలపై ఫిర్యాదు చేసారు. ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా కథనం ప్రకారం.. ఈ నిధులు చిత్రనిర్మాతలు కబీర్ ఖాన్- సాజిద్ నదియాడ్ వాలా - దీపికా పదుకొణె లతో పలు ఒప్పందాలకు మళ్లించబడ్డాయి. సదరు వ్యాపారవేత్త నుండి ఎటువంటి రాతపూర్వక అనుమతి పొందకుండానే రణవీర్ సింగ్ నటించిన 83 చిత్రం నిర్మాణం కోసం డబ్బును ఉపయోగించినట్లు తెలుస్తోంది. తన క్లయింట్ 83 నిర్మాతలందరిపైనా మోసం మరియు నేరపూరిత కుట్ర ఆధారంగా క్రిమినల్ ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది రిజ్వాన్ సిద్ధికీ తన ప్రకటనలో పేర్కొన్నారు.
మోస్ట్ అవైటెడ్ 83 విడుదలకు రెడీ అవుతోంది. ఇది భారత క్రికెట్ జట్టు 83లో ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకునే వరకు చేసిన ప్రయాణాన్ని వర్ణించే చిత్రం. ఇందులో రణ్ వీర్ సింగ్ తో పాటు సాకిబ్ సలీమ్- తాహిర్ భాసిన్- పంకజ్ త్రిపాఠి- అమీ విర్క్- హార్డీ సంధు- దీపికా పదుకొనే కూడా నటించారు. డిసెంబర్ 24న సినిమా థియేటర్లలోకి రానుంది.